లోన్ కోసం చూస్తున్నారా? మీకో శుభవార్త.. నేటి నుంచి బ్యాంకుల రుణ మేళా!

లోన్ కోసం చూస్తున్నారా? మీకో శుభవార్త.. నేటి నుంచి  బ్యాంకుల రుణ మేళా!
x
Highlights

బ్యాంకు నుంచి అప్పు పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇప్పుడు మీ దగ్గరకే వచ్చి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. ప్రభుత్వ...

బ్యాంకు నుంచి అప్పు పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. ఇప్పుడు మీ దగ్గరకే వచ్చి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈరోజు నుంచి రుణ మేళాలు నిర్వహించనున్నాయి. దేశవ్యాప్తంగా 250 జిల్లాల్లో నాలుగు రోజులపాటు రుణ మేళా నిర్వహించనున్నాయి బ్యాంకులు. నిబంధనల ప్రకారం అర్హతలున్న వారికి అక్కడికక్కడే రుణ మంజూరు ప్రక్రియ పూర్తీ చేస్తారు. ఇందులో వ్యవసాయ, వాహన, హోమ్, ఎడ్యుకేషన్, వ్యాపార, పర్సనల్ లోన్లు పొందొచ్చు.

మోదీ ప్రభుత్వం గత నెలలో దేశవ్యాప్తంగా 400 జిల్లాల్లో రుణ మేళాలు నిర్వహించాలని ప్రభుత్వ బ్యాంకులను కోరింది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ), బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ), కార్పొరేషన్ బ్యాంక్ లు రుణ మేళాలు నిర్వహించడానికి సిద్ధం అయ్యాయి. ఈమేరకు బ్యాంకులు టెంట్లు వేసుకొని లోన్ మేళా నిర్వహిస్తాయి. ఇక్కడ అన్ని రకాల బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. అన్ని రకాల రుణాలు పొందొచ్చు. పండుగ సమయంలో ఈ లోన్ మేళాలు కస్టమర్లకి ప్రయోజనాన్ని కలిగిస్తాయని భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories