మహిళలకి సువర్ణవకాశం.. రోజుకి రూ.29 పొదుపుతో రూ.4లక్షలు..!

LIC Aadhaar Shila Policy Only for Women Know Full Details
x

మహిళలకి సువర్ణవకాశం.. రోజుకి రూ.29 పొదుపుతో రూ.4లక్షలు..!

Highlights

మహిళలకి సువర్ణవకాశం.. రోజుకి రూ.29 పొదుపుతో రూ.4లక్షలు..!

LIC Aadhaar Shila Policy: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థ. ఈ కంపెనీ అన్ని వర్గాల వారికి అనుకూలమైన పాలసీలని రూపొందిస్తుంది. సంపాదించే వ్యక్తిని కోల్పోయిన కుటుంబాలు రోడ్డున పడకుండా ఆర్థిక భరోసానిస్తుంది. ఇందులో పెట్టుబడులు చాలా సురక్షితం. అయితే దేశంలో మహిళలు ఇన్సూరెన్స్ తీసుకోవడంలో చాలా వెనుకబడి ఉన్నారు. అందుకే వారిని దృష్టిలో పెట్టుకొని ఒక ప్రత్యేక పాలసీని ప్రారంభించింది. దీనిపేరు ఎల్‌ఐసీ ఆధార్ శిలా పాలసీ.

ఈ పాలసీ ప్రత్యేకత ఏంటంటే ఇది చిన్న పెట్టుబడితో పెద్ద రాబడిని సంపాదిస్తుంది. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు ఆడపిల్లల విద్య, వివాహం కోసం భారీ నిధులను సేకరించవచ్చు. ఎల్‌ఐసీ ఆధార్‌శిలా మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాలసీ. ఇది ఒక పొదుపు పథకం. ఇది బీమా రక్షణ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఈ పథకంలో మహిళలు ప్రతిరోజూ చిన్న మొత్తాన్ని పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తులో పెద్ద నిధిని సిద్ధం చేసుకోవచ్చు.

8 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వయస్సు గల మహిళలు ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో బేసిక్‌ హామీ మొత్తం అలాగే అదనపు ప్రయోజనాలను పొందవచ్చు.

1. కనీస హామీ మొత్తం – రూ.75,000

2. గరిష్ట హామీ మొత్తం – రూ 3,00,000

3. పాలసీ వ్యవధి - 10 నుంచి 20 సంవత్సరాలు

4. ప్రీమియం చెల్లింపు వ్యవధి - 10 నుంచి 20 సంవత్సరాలు

5. మెచ్యూరిటీ గరిష్ట వయస్సు - 70 సంవత్సరాలు

పెట్టుబడి, రాబడి

ఒక మహిళ 20 ఏళ్లపాటు ఆధార్‌శిలా పాలసీని కొనుగోలు చేసి కనీసం రూ.3 లక్షల హామీని ఎంచుకుంటే ఆమె మొదటి సంవత్సరంలో రూ.10,959 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రతి నెలా కేవలం రూ.899 మాత్రమే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇది రోజుకి రూ.29 రూపాయలు అవుతుంది. 20 సంవత్సరాల వ్యవధిలో మొత్తం డిపాజిట్ విలువ రూ. 2.15 లక్షలు అవుతుంది. అదే సమయంలో మెచ్యూరిటీలో దాదాపు రూ.4 లక్షల వరకు తిరిగి పొందుతారు.

ఈ పథకంలో మీరు 8 ఏళ్ల బాలిక పేరుపై పెట్టుబడి పెట్టవచ్చు. ఆమె విద్య, వివాహం వంటి ముఖ్యమైన ఖర్చుల కోసం భారీ నిధిని సృష్టించవచ్చు. ఈ పథకం ప్రీమియాన్ని నెల, మూడు నెలలు, 6 నెలలు లేదా వార్షిక ప్రాతిపదికన చెల్లించవచ్చు. పాలసీని కొనుగోలు చేసిన తర్వాత పాలసీదారు మరణిస్తే నామినీ మరణ ప్రయోజనం పొందుతారు. ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటే ఆధార్ కార్డు తప్పనిసరి.

Show Full Article
Print Article
Next Story
More Stories