IUC Charge: జియో తీపి కబురు.. వారికి అవుట్ గోయింగ్ ఛార్జీలు వర్తించవు

IUC Charge: జియో తీపి కబురు.. వారికి అవుట్ గోయింగ్ ఛార్జీలు వర్తించవు
x
Highlights

ఇంటర్ కనెక్ట్ యూసేజ్ ఛార్జీలు(IUC) వసూలు చేస్తామని కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రిలయన్స్ జియో.. తాజాగా ఐయూసీ ఛార్జీల గురించి మరో కీలక ప్రకటన చేసింది. ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే నిమిషానికి 6పైసలు వసూలు చేస్తామని ప్రకటించిన జియో.. అక్టోబర్ 9 లేదా అంతకంటే ముందు రీఛార్జ్ చేసుకున్న వారు ఈ ఐయూసీ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పింది. ప్రస్తుత ప్లాన్ ముగిసే వరకు నాన్ జియో నెంబర్లకు ఉచితంగానే కాల్స్ చేసుకోవచ్చని వెల్లడించింది. కాగా, ఇకపై రీఛార్జి చేసుకునే వారి నుంచి మాత్రం ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామని స్పష్టం చేసింది.

"డియర్ కస్టమర్, అక్టోబర్ 9వ తేదీ లేదా ఆ లోపు రీఛార్జ్ చేసుకున్నట్లు అయితే, ఉచిత కాల్స్ సౌకర్యం పొందొచ్చు. ప్రస్తుత ప్లాన్ ముగిసేవరకు నాన్ జియో నెంబర్లకు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. ఎలాంటి ఐయూసీ ఛార్జీలు వసూలు చెయ్యము" అని రిలయన్స్ జియో మేసేజ్ పెట్టింది.

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ మానస పుత్రికగా చెప్పుకునే రిలయన్స్ జియో కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వాయిస్ కాల్స్‌కు చార్జీలు వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వంటి టెలికం కంపెనీలకు కాల్ చేస్తే ఇప్పుడు చార్జీలు చెల్లించాల్సిందే.

ఇకపోతే అన్ని ఉచిత వాయిస్ కాల్స్ అంటూ ఊదరగొట్టిన జియో.. ఛార్జీల మోత మోగించింది. ఇకపై ఫ్రీ కాల్స్ లేవని చెప్పింది. ఐయూసీ ఛార్జీలు వసూలు చేస్తామంది. జియో నుంచి ఇతర నెట్ వర్క్ లకు కాల్ చేస్తే ఇంటర్‌ కనెక్ట్ యూసేజ్ చార్జీల్లో (ఐయూసీ) భాగంగా నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామంది. జియో కస్టమర్ల నుంచి వసూలు చేసే ఐయూసీ ఛార్జీలను ఇతర టెలికం కంపెనీలకు చెల్లిస్తుంది. అయితే 6 పైసలు ఛార్జీలకు గానూ కస్టమర్లకు అదనంగా డేటా అందిస్తామని కంపెనీ తెలిపింది. దీంతో టారిఫ్ పెరినట్లు భావించొద్దని వివరించింది. జియో నుంచి జియోకు, ల్యాడ్ లైన్స్‌కు, వాట్సాప్ కాల్స్ వంటి వాటికి ఎలాంటి ఛార్జీలు ఉండదు. ఇవి ఉచితమే.

జియో కస్టమర్లు ఎయిర్‌టెల్ లేదా వొడాఫోన్ ఐడియా నెంబర్లకు కాల్ చేయాలంటే మాత్రం అదనపు టాపప్ వోచర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి ధర రూ.10, రూ.20, రూ.50, రూ.100గా ఉంది. జియో నిర్ణయంతో 35 కోట్ల మంది యూజర్లపై ప్రభావం పడనుంది.

అక్టోబర్ 9వ తేదీ తర్వాత జియో కస్టమర్లు చేసుకునే కొత్త రీఛార్జీలపై ఐయూసీ భారం పడుతుందని జియో స్పష్టం చేసింది. అక్టోబర్ 9వ తేదీ లేదా ఆలోపు.. నెల, 3 నెలలు, ఏడాది కాల వ్యవధి రీఛార్జీలు చేయించుకున్న వారు మాత్రం.. వారి ప్లాన్ ముగిసే వరకు ఉచితంగానే ఇతర నెట్ వర్క్ లకు మాట్లాడుకోవచ్చు. ఐయూసీ ఛార్జీలను ట్రాయ్ రద్దు చేసే వరకు.. ఈ ఛార్జీలు వసూలు చేయక తప్పదని జియో తెలిపింది. జియో పోస్ట్ పెయిడ్ కస్టమర్లు కూడా ఇతర నెట్ వర్క్ లకు చేసే కాల్స్ కు నిమిషానికి 6 పైసలు అదనంగా చెల్లించాల్సిందే.

ట్రాయ్ రూల్స్ ప్రకారం ఒక టెలికాం నెట్ వర్క్ నుంచి మరో నెట్ వర్క్ కు కాల్ వెళ్తే.. అనుసంధాన ఛార్జి(ఐయూసీ) కింద మొదటి సంస్థ నిమిషానికి 6 పైసలు చెల్లించాలి. జియో నెట్ వర్క్ నుంచి కాల్స్ అన్నీ ఫ్రీ అని ప్రకటించడంతో.. ఎయిర్ టెడ్, వొడాఫోన్ -ఐడియా సంస్థలకు వెళ్లిన కాల్స్ కోసం గత మూడేళ్లలో జియో రూ.13వేల 500 కోట్లు చెల్లించింది. ఈ నష్టాల నుంచి బయటపడేందుకు ఇతర నెట్ వర్క్ లకు చేసుకునే కాల్స్ కు ఛార్జీలు వసూలు చేయాలని జియో నిర్ణయించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories