ధర పెరిగింది..డిమాండ్ తగ్గింది.. 2019 బంగారం పరిస్థితి ఇదీ!

ధర పెరిగింది..డిమాండ్ తగ్గింది.. 2019 బంగారం పరిస్థితి ఇదీ!
x
Highlights

వామ్మో బంగారం పెరిగిపోయింది అనుకుంటూనే తప్పనిసరిగా కొనే పరిస్థితులు మారాయి ఇప్పుడు. ధరలు పెరిగితే డిమాండ్ తాగిపోయే పరిస్థితులు వచ్చాయిప్పుడు. గతేడాది...

వామ్మో బంగారం పెరిగిపోయింది అనుకుంటూనే తప్పనిసరిగా కొనే పరిస్థితులు మారాయి ఇప్పుడు. ధరలు పెరిగితే డిమాండ్ తాగిపోయే పరిస్థితులు వచ్చాయిప్పుడు. గతేడాది (2019 క్యాలెండర్ ఇయర్) లో బంగారం ధరలు రికార్డ్ స్థాయికి పెరిగిన సంగతి తెలిసిందే. ఆర్థిక మందగమనం దీనికి తోడైంది. దాంతో పుత్తడికి దేశీయంగా డిమాండ్ తగ్గింది.

ఈ విషయాన్ని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) గురువారం తమ నివేదికలో వెల్లడించింది. ఆ నివేదిక ప్రకారం గత క్యాలెండర్ ఇయర్ లో బంగారానికి ఏకంగా 9 శాతం డిమాండ్ తగ్గినట్లు నివేదిక పేర్కొంది. దీంతో 690.4 టన్నులు డిమాండ్ మాత్రమె వచ్చింది. అంతకు ముందు సంవత్సరం (2018) లో ఈ డిమాండ్ 760.4 టన్నులుగా ఉంది. 2019లో బంగారం ధరలు పెరగడంతో డిమాండ్ తగ్గింది. దీంతో 2018లో 755.7 టన్నలు దిగుమతి చేసుకోగా, 2018లో 646.8 టన్నులు భారత్ దిగుమతి చేసుకుంది. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ లేకపోవడంతో పాటు రీసైకిల్ చేసిన పసిడి వ్యాల్యూ 37 శాతం పెరిగింది.

పెరిగిన ధరలు..

2019లో సెప్టెంబర్ నెలలో బంగారం ధర రూ.40వేలు దాటింది. అప్పటి నుంచి కాస్త అటు ఇటుగా రూ.39వేల నుంచి రూ.40 వేల మధ్య ఉంది. 2018 చివరితో పోలిస్తే గత ఏడాది చివర పెరిగిన బంగారం ధర 24 శాతంగా ఉంది. అదేవిధంగా రీసైకిల్ చేసిన పసిడి వ్యాల్యూ 37 శాతం పెరిగింది. దీంతో బంగారానికి డిమాండ్ తగ్గడంతో పాటు దిగుమతులు కూడా పడిపోయాయి.

మందగమనమే కారణం..

దేశీయంగా రికార్డ్ స్థాయిలో ధరలు పెరిగాయని, పైగా మందగమనం ఉందని, ఇవి పసిడి విక్రయాలపై భారీగా ప్రభావం చూపాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ భారత మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరమ్ అన్నారు. ధనత్రయోదశి వంటి శుభదినాల్లో కూడా కొనుగోళ్లు అంతగా లేవన్నారు. 2020లో బంగారానికి డిమాండ్ కాస్త పెరిగే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే గత ఏడాది హఠాత్తుగా ధరలు పెరిగాయని, దీంతో డిమాండ్ తగ్గిందని, ఇప్పుడు ఆ పెరిగిన ధరల్లోనే కాస్త అటు ఇటుగా ఉంటున్నాయని, ఈ నేపథ్యంలో పెరిగిన ధరలను అంగీకరించడంతో పాటు బడ్జెట్‌లో ఆర్థిక సంస్కరణలు తీసుకు వస్తే కొనుగోళ్లు పెరుగుతాయని అయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సంవత్సరం డిమాండ్ ఎంత?

2020లో బంగారానికి 700 నుంచి 800 టన్నుల డిమాండ్ ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. అయితే బంగారం దిగుమతులపై ప్రభుత్వం విధించిన సెస్ 12.5 శాతాన్ని 10 శాతానికి తగ్గించాలని కోరుతున్నారు. అలా అయితే డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా కూడా బంగారం జ్యువెల్లరీకి డిమాండ్ తగ్గిందని WGC పేర్కొంది. గత ఏడాది 6 శాతం తగ్గి 2,107 టన్నులకు పడిపోయింది. కేవలం నాలుగో క్వార్టర్‌లోనే 2018తో పోలిస్తే 2019లో ఏకంగా 10 శాతం తగ్గింది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో గత క్యాలెండర్ ఏడాదిలో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపారు. అమెరికా - చైనా ట్రేడ్ వార్ వంటి వివిధ కారణాల వల్ల సురక్షిత బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారు. అయినప్పటికీ అంతర్జాతీయంగా కూడా బంగారానికి డిమాండ్ 1 శాతం తగ్గింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories