కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి

కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి
x
Highlights

బహిరంగ మార్కెట్లో ఉల్లి కొంటే చాలు కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి కొరతతో ధరలు చుక్కల్ని అంటాయి. కేజీ ఉల్లి 80 రూపాయల నుండి వంద రూపాయలు...

బహిరంగ మార్కెట్లో ఉల్లి కొంటే చాలు కోయకుండానే కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి కొరతతో ధరలు చుక్కల్ని అంటాయి. కేజీ ఉల్లి 80 రూపాయల నుండి వంద రూపాయలు పలుకుతోంది. దీంతో సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని రైతు బజార్లలో ఉల్లిని విక్రయిస్తోంది ప్రభుత్వం. ఒక్కొక్కరికి ఒక్కో కేజీ ఉల్లి అందిస్తున్నారు.

ఉల్లి ధరలను క్రమబద్దీకరించడంతో పాటు ప్రజలకు ఉల్లిని అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతు బజార్ల వద్ద ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి కిలో 25 రూపాయలకు విక్రయిస్తున్నారు. రెండు, మూడు నెలలుగా ఉల్లి ధర కొండెక్కి కూర్చుంది. గత కొంత కాలంగా బహిరంగ మార్కెట్‌తో పాటు రైతు బజార్లలో కూడా కేజీ ఉల్లి 50పై మాటే. వారం రోజులుగా వంద రూపాయలు ధర పలుకుతుండటంతో ఉల్లి కొనాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.

డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో వ్యాపారులు, దళారులు ఉల్లి రేట్లను అమాంతం పెంచుకుంటూ పోతున్నారు. అయితే ప్రభుత్వం ఉల్లి ధరలను క్రమబద్దీకరించే చర్యలు చేట్టింది. రైతు బజార్లలో ఒక్కో వ్యక్తికి ఒక్కో కిలో చొప్పున ఆధార్, రేషన్ కార్డుల ఆధారంగా విక్రయిస్తుంది. ప్రతి రోజు ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటల పాటు టోకెన్లు అందించి విక్రయాలు జరుపుతున్నారు. దీంతో రైతు బజార్ల వద్ద చాంతాడంత క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున మహిళలు, పిల్లలు సైతం క్యూలైన్లలో తమ వంతుకోసం వెయిట్‌ చేస్తున్నారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories