Fastlane: ఇక పెట్రోల్ కోసం బంకుల్లో క్యూలో వేచి ఉండక్కర్లేదు..ఫాస్ట్ లేన్ విధానానికి శ్రీకారం

Fastlane: ఇక పెట్రోల్ కోసం బంకుల్లో క్యూలో వేచి ఉండక్కర్లేదు..ఫాస్ట్ లేన్ విధానానికి శ్రీకారం
x
Highlights

అత్యవసర పనిమీద కారులో బయలు దేరారు. పెట్రోల్ కొట్టించుకోవడానికి దగ్గరలో ఉన్న బంకు వద్దకు చేరుకున్నారు. అయితే, అక్కడ రద్దీతో కనీసం అరగంట సమయం...

అత్యవసర పనిమీద కారులో బయలు దేరారు. పెట్రోల్ కొట్టించుకోవడానికి దగ్గరలో ఉన్న బంకు వద్దకు చేరుకున్నారు. అయితే, అక్కడ రద్దీతో కనీసం అరగంట సమయం పాట్టింది. ఈలోపు మీరనుకున్న పని కాస్తా ఇబ్బందిలో పడిపోయింది. సాధారణంగా నగరాలలో ఇటువంటి పరిస్థితి కారు ఉన్న చాలా మందికి వస్తుంటుంది. అదీకాక, కారు తీసుకుని లైనులో నిలబడాల్సి రావడం చాలా ఇబ్బందిగానూ ఉంటుంది. కారు పంపు వద్దకు పోనిచ్చేలోపు ద్విచక్ర వాహనాలు వచ్చి చేరిపోతాయి. అదీకాకుండా పెట్రోల్ పోయించుకున్న తరువాత బిల్లు చెల్లించాలంటే మరో పది నిమిషాలు వేచి చూడాల్సిన పరిస్థితీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఇబ్బందులకు చెక్ చెప్పడానికి కొత్త విధానాన్ని ముంబయి లో తీసుకు వచ్చారు.

ఫాస్టాగ్ తరహాలో..

ఇటీవల కేంద్ర ప్రభుత్వం టోల్ గెట్ ల వద్ద రద్దీని నియంత్రించడం.. అక్కడ వాహనాలు నిలబడిపోకుండా వెళ్లిపోయేలా చేయడం కోసం ఫాస్టాగ్ అనే విధానాన్ని పరిచయం చేసింది. దీంతో టోల్ గెట్ ల వద్ద నిరీక్షణకు దాదాపుగా తెరపడింది. ఈ విధానం విజయవంతం కావడంతో పెట్రోల్ కంపెనీల దృష్టి దీనిమీద పడింది. తమ బ్యాంకులలో కార్లు ఎక్కువ సేపు వేచి ఉండక్కర్లేకుండా ఉండేందుకు ఇటువంటి టెక్నాలజీ తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

ఫాస్ట్ లేన్ గా నామకరణం..


ఈ విధానానికి ఫాస్ట్ లేన్ గా పేరుపెట్టారు. హెచ్పీసీఎల్ కంపెనీ ఇందుకు నాంది పలికింది. నావీ ముంబై, పూణే, థానే నగరాల్లోని పెట్రోల్ పంపుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నారు. ముంబైకి చెందిన స్టార్టప్ ఏజీఎస్ ట్రాన్స్‌సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసింది.

120 HPCL బంకుల్లో..


ప్రస్తుతం ముంబై, నేవీ ముంబై, థానే, పుణేల్లోని 120 HPCL పెట్రోల్ పంపుల్లో Fastlaneను ప్రయోగాత్మకంగా ప్రవేశ పెట్టారు. ఇక్కడ పని తీరు అనంతరం దేశంలోని ప్రధాన నగరాలలో దీనిని అమలు చేయాలని భావిస్తున్నామని, మార్చి 2020 నాటికి దేశంలోని 10 ముఖ్య నగరాల్లోని పెట్రోల్ పంపుల్లో దీనిని తీసుకు వస్తామని పెట్రోలియం అండ్ డిజిటల్ పేమెంట్ బిజినెస్ సంస్థ ఏజీఎస్ ట్రాన్‌సాక్ట్ టెక్నాలజీస్ లిమిటెడ్ హెడ్ సతీష్ అన్నారు. ముంబైలోని HPCL బంకుల్లోని 2 శాతం Fastlane ద్వారా కొనసాగుతోందని చెప్పారు.

ఫాస్ట్ లేన్ ఎలా పనిచేస్తుంది?


ఫాస్టాగ్ తరహాలోనే ఈ ఫాస్ట్ లైన్ కూడా పనిచేస్తుంది. ముందు వినియోగదారులు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత రేడియో ప్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) రీడర్ స్టిక్కర్‌ను కారు ముందు భాగంలో అతికించాలి. ఏ ఇంధనం ఎంత కావాలో బంకుకు చేరుకోవడానికి ముందే యాప్ ద్వారా ఫీడ్ చేసి పెట్టాలి. బంకులోకి వెళ్లగానే అక్కడ ఉండే ప్రత్యేక వ్యవస్థ RFIDని రీడ్ చేసి ఫాస్ట్‌లేన్‌లో ఫీడ్ చేసిన సమాచారాన్ని పెట్రోల్ బంకు అటెండెంట్‌కు చేరవేస్తుంది. వారు అందుకు అనుగుణంగా ఇంధనం నింపుతారు. బిల్లు కట్టేందుకు ప్రత్యేకంగా వేచి చూడాల్సిన అవసరం లేదు. ఇంధనం నింపగానే వెళ్లిపోవచ్చు. యాప్‌కు అనుసంధానించిన బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపు పూర్తవుతుంది. ఆ తర్వాత మొబైల్‌కు నోటిఫికేషన్ వస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories