మరో కీలక నిర్ణయం తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్.. వారికి ఊరటే..

మరో కీలక నిర్ణయం తీసుకున్న జీఎస్టీ కౌన్సిల్.. వారికి ఊరటే..
x
Highlights

నిన్న( గురువారం) దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ 32వ మండలి సమావేశంలోజరిగింది … చిన్న వ్యాపారులకు వస్తు, సేవల...

నిన్న( గురువారం) దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ 32వ మండలి సమావేశంలోజరిగింది … చిన్న వ్యాపారులకు వస్తు, సేవల పన్ను నుంచి ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ పరిధిలోకి వచ్చే వ్యాపార పరిమితిని పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. సుదీర్ఘ చర్చ అనంతరం, చిన్న వ్యాపారులకు జీఎస్టీ మినహాయింపు పరిమితిని రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటించారు ఆర్ధిక మంత్రి జైట్లీ.

ప్రస్తుతమున్న పరిమితిని 20లక్షల నుంచి 40లక్షల రూపాయలకు పెంచుతున్నట్టు వెల్లడించారు. ఇదిలావుంటే గత నెలలో 23 వస్తువులను జీఎస్టీ తక్కువ పన్ను శ్లాబులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటిలో పవర్‌ బ్యాంకులు, డిజిటల్‌ కెమెరాలు, సినిమా టికెట్లు, 32 అంగుళాల వరకు టీవీలు, వీడియో గేమ్స్‌పై పన్ను భారం తగ్గించింది. ఈ తగ్గించిన ధరలు ఈ ఏడాది మొదటి వారం నుంచే అమల్లోకి వచ్చాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories