వాహన కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్!

వాహన కొనుగోలుదారులకు కేంద్ర ప్రభుత్వం షాక్!
x
Highlights

కొత్తగా వాహనం కొనే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ...

కొత్తగా వాహనం కొనే వారికి కేంద్ర ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పర్యావరణానికి హితం చేసే విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించాలని భావిస్తున్న కేంద్రం అందుకు తగ్గ వ్యూహాల్ని రూపొందిస్తోంది. అందులో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని చూస్తోంది.

దీనికోసం ప్రస్తుతం డ్రాఫ్ట్ దశలో ఉన్న ప్రతిపాదనల ప్రకారం కొత్త కారు రిజిస్ట్రేషన్ కు 5 వేల రూపాయలు ఉండవచ్చు. అలాగే పాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేయించుకోవాలంటే అది 10 వేలు అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు వీటి చార్జీలు 600 మాత్రమే. ఇక టూవీలర్ కొత్త రిజిస్ట్రేషన్ ఫీజు వెయ్యి రూపాయలు ఉండవచ్చు. ఇది ప్రస్తుతం 50 రూపాయలు మాత్రమే. ఇక రెన్యువల్ అయితే 2000 కావచ్చు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories