Pensioners: పెన్షనర్లకి శుభవార్త.. ఇక ఆ ఇబ్బంది ఉండదు..!

Good news for pensioners Life certificate can be submitted online from October 1 No need to go to banks
x

Pensioners: పెన్షనర్లకి శుభవార్త.. ఇక ఆ ఇబ్బంది ఉండదు..!

Highlights

Pensioners: పెన్షనర్లకి శుభవార్త.. ఇక ఆ ఇబ్బంది ఉండదు..!

Pensioners: పెన్షనర్లకి, సీనియర్ సిటిజన్లకి ఇది శుభవార్తని చెప్పవచ్చు. లైఫ్ సర్టిఫికెట్‌ సమర్పించే విషయంలో ఇక ఏ ఇబ్బంది ఉండదు. ప్రభుత్వం ఈ పనిని మరింత సులభతరం చేసింది. ఇప్పుడు ఈ పని ఆన్‌లైన్‌లో జరుగుతున్నందున పెన్షనర్లు బ్యాంకుకు హాజరు కావాల్సిన అవసరం లేదు. అక్టోబరు 1 నుంచి దీని ప్రత్యేక ఫీచర్‌ను ప్రారంభించారు. రిటైర్మెంట్‌ పొందిన వ్యక్తి పప్రతి నవంబర్‌లో లైఫ్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలి. దీని ఆధారంగా వచ్చే ఏడాదికి పెన్షన్ చెల్లిస్తున్న సంగతి తెలిసిందే.

కొత్త సదుపాయం ప్రయోజనం ఎవరు ఎలా పొందవచ్చనే సమాచారం పెన్షనర్స్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. సెప్టెంబర్ 30న పెన్షనర్ల విభాగం జారీ చేసిన మెమోరాండంలో 80 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పింఛనుదారులు అక్టోబర్ 1 నుంచి ఆన్‌లైన్‌లో వార్షిక జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించవచ్చని పేర్కొంది. గతంలో ఈ పని నవంబర్ 1 తర్వాత జరిగేది.

12 ప్రభుత్వ బ్యాంకులు లైఫ్‌ సర్టిఫికేట్‌ సేవలని అందిస్తున్నాయి. ఇందుకోసం పెన్షన్ దారులు డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని తీసుకోవచ్చు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ కూడా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించే సహాయంతో ఇంటింటికి బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. పెన్షనర్ జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో జీవన్ ప్రమాణ్‌ను సమర్పించవచ్చు. ఈ ప్రక్రియలో బయోమెట్రిక్ పరికరం నుంచి పెన్షనర్ వివరాలను తీసుకుంటారు.

లైఫ్ సర్టిఫికేట్ పోస్ట్‌మ్యాన్ ద్వారా కూడా సమర్పించవచ్చు. IPPB దీని కోసం పోస్టాఫీసులో ఉన్న 1,36,000 యాక్సెస్ పాయింట్లను సృష్టించింది. డోర్‌స్టెప్ సౌలభ్యం కోసం 1,89,000 మంది పోస్ట్‌మెన్, డాక్ సేవకులు తమ సేవలను అందిస్తున్నారు. ఆధార్ సహాయంతో పెన్షనర్లు ఫేస్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌లను సమర్పించవచ్చు. ఈ టెక్నాలజీతో పెన్షనర్ ఏదైనా Android స్మార్ట్‌ఫోన్ నుంచి డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్‌ను సమర్పించవచ్చు.

ఈ సందర్భంగా రైల్వే మంత్రి తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసర వస్తువుల సరఫరాలో రైల్వే చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇది దేశంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడానికి సహాయపడింది. ఈ విషయంలో రైల్వే ఉద్యోగులు ఎంతో శ్రమించారు. ఈ పండుగ సీజన్‌లో వారికి అందించే బోనస్ వారి కుటుంబ ఖర్చులకి ఎంతో కొంత దోహదం చేస్తుందని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories