దిగివచ్చిన బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి ధరలు!

దిగివచ్చిన బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి ధరలు!
x
Representational Image
Highlights

నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు (26-11-2019) తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి.

నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు ఈరోజు దేశీయ మార్కెట్లలో తగ్గుదలను నమోదు చేశాయి. కాగా..వెండి ధరలు కూడా దిగివచ్చాయి. 26.11.2019 మంగళవారం పది గ్రాముల బంగారం ధర సోమవారం ధరలతో పోలిస్తే 150 రూపాయలవరకూ తగ్గాయి. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేశాయి.

మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 150 రూపాయలు తగ్గి 39,550 రూపాయల వద్దనిలిచింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 140 రూపాయలు తగ్గి 36,250 రూపాయలకు చేరింది. ఇక వెండి ధరలు కూడా తగ్గుదల నమోదు చేయడంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 300 రూపాయలు తగ్గి 46,400 రూపాయలుగా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,550 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,250 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా,ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలు దిగివచ్చాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 150 రూపాయలు తగ్గి 38,200 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 150 రూపాయలు తగ్గి 37,000 రూపాయల వద్దకు చేరింది. ఇక వెండి ధర కూడా కేజీకి ఏకంగా 330 రూపాయలు తగ్గి 46,400 రూపాయల వద్దకు దిగివచ్చింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 26.11.2019 సోమవారం ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories