బంగారం దోబూచులాట.. భారీగా పడిపోయిన బంగారం..వెండి ధరలు!

బంగారం దోబూచులాట.. భారీగా పడిపోయిన బంగారం..వెండి ధరలు!
x
Highlights

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. అప్పటికప్పుడే పైకెగుస్తున్నాయి. ఒక్కరోజులో కిందకి దిగివస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా...

బంగారం ధరలు దోబూచులాడుతున్నాయి. అప్పటికప్పుడే పైకెగుస్తున్నాయి. ఒక్కరోజులో కిందకి దిగివస్తున్నాయి. నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈరోజు ఒక్కసారిగా కిందకు దిగివచ్చాయి. ఈరోజు (10.01.2020) బంగారం ధరలు భారీగా తగ్గాయి. అదే విధంగా నిన్న బంగారం తో పాటు పైకెగసిన కనిపించిన వెండి ధరలు కూడా ఈరోజు ఢమాల్ అన్నాయి.

హైదరాబాద్ మార్కెట్లో శుక్ర వారం బంగారం ధరలు గురువారం ధరలతో పోలిస్తే భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఏకంగా 1,070 రూపాయలు తగ్గింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 41,790 రూపాయలకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో తగ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 970 రూపాయలు తగ్గడంతో 38,300 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా కేజీకి ఏకంగా ఒక్కసారిగా 1500 రూపాయలు తగ్గాయి. దీంతో కేజీ వెండిధర 49,500 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 41,790 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,300 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు కిందికి దిగివచ్చాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 980 రూపాయలు పడిపోయింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,300 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 1000 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,100 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 1500 రూపాయలు దిగివచ్చింది. దాంతో వెండి ధర కేజీకి 49,500 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు10.01.2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories