బంగారం భారీ షాక్! 41 వేలు దాటిపోయింది.. వెండి కాస్త పెరిగింది!

బంగారం భారీ షాక్! 41 వేలు దాటిపోయింది.. వెండి కాస్త పెరిగింది!
x
Highlights

బంగారం ధరలు ఒక్కసారిగా షాకిచ్చాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలో నిన్నా మొన్నా స్వల్పంగా అటూ ఇటూ కదిలిన బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. ఇక వెండి ధరలు...

బంగారం ధరలు ఒక్కసారిగా షాకిచ్చాయి. కొత్త సంవత్సరం ప్రారంభంలో నిన్నా మొన్నా స్వల్పంగా అటూ ఇటూ కదిలిన బంగారం ధర ఈరోజు భారీగా పెరిగింది. ఇక వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరుగుదల నమోదు చేశాయి.

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధరలు శుక్రవారం ధరలతో పోలిస్తే అమాంతం పెరిగిపోయాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఏకంగా 660 రూపాయలు పెరిగి షాక్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలా ఒక్కసారిగా ఇంత భారీ పరుగుదలను బంగారం ఇంతకు ముందు ఎప్పుడు నమోదు కాలేదు. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 41,380 రూపాయలకు ఎగబాకింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పెరిగింది. ఏకంగా 660 రూపాయలు పెరగడంతో 37,930 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండి ధరలు స్వల్పంగా కేజీ కి 50 రూపాయలు పెరిగాయి. దీంతో కేజీ వెండిధర 49,500 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 41,380 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 37,930 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలుమరింత పెరిగాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా 750 రూపాయలు పైకి ఎగసింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 39,950 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 750 రూపాయల పెరుగుదల నమోదు చేసి 38,950 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 50 రూపాయలు పెరిగింది. దాంతో వెండి ధర కేజీకి 49,400 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 04.01.2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories