భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలూ కిందికే!

భారీగా తగ్గిన బంగారం ధరలు.. వెండి ధరలూ కిందికే!
x
Highlights

వరుసగా పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలకు నిన్న బ్రేక్ పడింది. స్వ్లపంగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ఈరోజు (30.01.2020) భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా...

వరుసగా పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలకు నిన్న బ్రేక్ పడింది. స్వ్లపంగా తగ్గుదల నమోదు చేసిన బంగారం ఈరోజు (30.01.2020) భారీగా తగ్గింది. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులతో బంగారం ధరలో భారీ కదలిక వచినదని నిపుణులు చెబుతున్నారు. డాలరుతో మారకం విషయంలో రూపాయి బలపడటం కూడా బంగారం దిగోచ్చేలా చేసిందని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో పెరుగుతూ రావడమే తప్ప కింది చూపులు చూడని బంగారం ధరలు ఈరోజు కిందకి దిగోచ్చాయి. దీంతో బంగారం కొనుగోలు చేసే వారికి ఇది శుభవార్త అనే చెప్పొచ్చు. పెళ్ళిళ్ళ సీజన్ ప్రారంభం కావడంతో బంగారం ధరల్లో తగ్గుదల ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే వార్త అనే చెప్పాలి.

భారీగా తగ్గిన బంగారం..


మార్కెట్లో గురువారం బంగారం ధరలు భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 340రూపాయలు పడిపోయింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 42,240 నుంచి 41,900 రూపాయలకు దిగివచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీ తగ్గ్గుదల నమోదు చేసింది. పది గ్రాములకు 340 రూపాయలు తగ్గడంతో 38,720నుంచి 38,380 రూపాయల వద్దకు చేరుకుంది.

వెండి ధరలు కిందకి దిగొచ్చాయి..


ఒకవైపు బంగారం ధరలు భారీగా తగ్గుదల నమోదు చేయగా.. వెండి ధరలు కూడా అదే దారిలో నడిచాయి. ఒక్కసారిగా కేజీకి 400 రూపాయలు తగ్గింది. దీంతో వెండి ధరలు కేజీకి 49,200 రూపాయల వద్దకు దిగొచ్చాయి.

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా.. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 41,900 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 38,380 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 49,200 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..


కాగా, ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు దిగోచ్చాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 350 రూపాయలు తగ్గింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 40,450 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 350 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,200 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా మార్పులు లేకుండా ఉన్నాయి. దాంతో వెండి ధర కేజీకి 49,600 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 30.01.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును

Show Full Article
Print Article
More On
Next Story
More Stories