Gold Rate: మళ్ళీ దిగొచ్చిన బంగారం..వెండి ధరలూ తగ్గాయి!

Gold Rate: మళ్ళీ దిగొచ్చిన బంగారం..వెండి ధరలూ తగ్గాయి!
x
Highlights

బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. గత వారంలో వరుసగా రెండు రోజులు తగిన బంగారం ధరలు.. ఈ వారం ప్రారంభంలోనూ తగ్గుదల తోనే ప్రారంభం అవుతున్నాయి. పది...

బంగారం ధరలు భారీగా పతనం అవుతున్నాయి. గత వారంలో వరుసగా రెండు రోజులు తగిన బంగారం ధరలు.. ఈ వారం ప్రారంభంలోనూ తగ్గుదల తోనే ప్రారంభం అవుతున్నాయి. పది గ్రాముల బంగారం దాదాపు వెయ్యి రూపాయల వరకూ తగ్గుదలను నమోదు చేసింది. ఇక వెండి కూడా అదే బాటలో ఉంది. కేజీ వెండి 230 రూపాయల తగ్గుదల నమోదు చేసింది.

హైదరాబాద్ లో బంగారం ధరలు భారీ తగ్గుదల నమోదు చేశాయి. సోమవారం (16.03.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు శనివారం నాటి ధర కంటే 860 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,340 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 930 రూపాయల తగ్గుదలతో 42,920 రూపాయలు నమోదు చేసింది.

భారీగా తగ్గిన వెండి ధరలు...

నిన్న నిలకడగా ఉన్నవెండి ధరలు ఈరోజు కాస్త దిగోచ్చాయి. కేజీకి 230 రూపాయల తగ్గుదల నమోదు చేశాయి. దీంతో దిగొచ్చిన కేజీ వెండి ధర 47,800 రూపాయల వద్దకు చేరింది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 1120 రూపాయల తగ్గుదల నమోదు చేసి 40,200 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 1120 రూపాయల తగ్గుదలతో 43,850 రూపాయలు నమోదు చేసింది. అదేవిధంగా వెండి ధరలు కూడా తగ్గడంతో కేజీకి 48,030 రూపాయలుగా నమోదైంది.

దేశ రాజధాని ఢిల్లీలో..


ఇక, దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు దిగోచ్చాయి.. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 850 రూపాయల తగ్గుదలతో 41,400 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 850 రూపాయల తగ్గుదలతో 40,200 రూపాయలకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా 230 రూపాయలు తగ్గి 47,800 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 16-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories