గత వారంలో భారీగా తగ్గిన బంగారం.. కిందికి పడిపోయిన వెండి ధరలు! ఎంతంటే..

గత వారంలో భారీగా తగ్గిన బంగారం.. కిందికి పడిపోయిన వెండి ధరలు! ఎంతంటే..
x
Highlights

బంగారం ధరలు ఈ వారంలో (ఫిబ్రవరి 2 ఆదివారం నుంచి ఫిబ్రవరి 8 శనివారం వరకూ ) భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా వచ్చిన ఒడిదుడుకులు.. చైనా లో వ్యాపించిన కరోనా...

బంగారం ధరలు ఈ వారంలో (ఫిబ్రవరి 2 ఆదివారం నుంచి ఫిబ్రవరి 8 శనివారం వరకూ ) భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా వచ్చిన ఒడిదుడుకులు.. చైనా లో వ్యాపించిన కరోనా వైరస్ కారణంగా ఎదురైనా వత్తిళ్ళ మామధ్య బంగారం ధరలు వారమంతా కిందకీ, పైకీ కదులుతూ వచ్చాయి. అయితే, వారం మొత్తంగా చూసుకుంటే గత ఆదివారం ప్రారంభ ధర నుంచి శనివారం ముగింపు ధర తో పోల్చి చూస్తె బంగారం ధరలు భారీగా తగ్గాయి. దాదాపుగా ప్రతిరోజూ ధరల్లో మార్పు వస్తూనే వుంది.

బంగారం తగ్గింది ఇలా..

ఫిబ్రవరి 2 ఆదివారం 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ప్రారంభ ధర 42,760 రూపాయలుగా ఉంది. ఇక నిన్న అంటే ఫిబ్రవరి 8 వ తేదీ శనివారం ముగింపు ధర 42,520 గా వుంది. అంటే పది గ్రాములకు 240 రూపాయలు తగ్గింది. ఇక పోతే, 22 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఫిబ్రవరి 2 ఆదివారం ప్రారంభధర 39,720 రూపాయలు నమోదు కాగా, నిన్న ఫిబ్రవరి 8 వ తేదీ శనివారం ముగింపు ధర 38,980 రూపాయలుగా నిలిచింది. అంటే 740 రూపాయలు తాగ్గుదల నమోదు అయింది.

వెండి ధరలు ఇలా..

అదేవిధంగా వెండి ధరలూ గత వారంలో భారీగా పతనం అయ్యాయి. ఫిబ్రవరి 2 ఆదివారం కేజీ వెండి ధర 49,990 రూపాయల వద్ద ప్రారంభం అయింది. నిన్న ఫిబ్రవరి 8 వ తేదీ శనివారం ముగింపు ధర 49,000 రూపాయలుగా నిలిచింది. అంటే వారం మొత్తమ్మీద 990 రూపాయలు పడిపోయింది. వెండి కూడా బంగారం ధరలతో పాటు హెచ్చు తగ్గులను చూపిస్తూ వచ్చింది. ఒక దశలో అంటే ఫిబ్రవరి 6 వ తేదీ నాటికి 48,000 రూపాయలకు కేజీ వెండి ధర పడిపోయింది. అయితే, తరువాత రెండు రోజుల్లోనూ కాస్త పుంజుకుని వారాంతానికి 49,000 రూపాయల వద్దకు చేరుకుంది.

ఇక ఈవారం కూడా బంగారం, వెండి ధరల్లో హెచ్చు తగ్గులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అంతర్జాతీయంగా ఆర్ధిక పరిస్థితుల ఒడిదుడుకులు గత వారంలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తుండడం తో బంగారం ధరల్లో కూడా అదే మేరకు ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందంటున్నారు. బంగారం మీద పెట్టుబడులు పెట్టేవార్ ఆచి, తూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని వార్ సూచిస్తున్నారు.

పైన పేర్కొన్న ధరలు దేశవ్యాప్త ధరలు. ఈ ధరల్లో స్థానికంగా కొంత మార్పులు ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ స్థూలంగా చూసుకుంటే బంగారం, వెండి ధరలు గత వారంలో తగ్గుదల నమోదు చేశాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories