బాబోయ్ బంగారం..మళ్ళీ భగ్గుమంది! వెండి కూడా అందంత ఎత్తుకు ఎగసింది!

బాబోయ్ బంగారం..మళ్ళీ భగ్గుమంది! వెండి కూడా అందంత ఎత్తుకు ఎగసింది!
x
Highlights

బంగారం భగ్గుమంది. మొన్న భారీ స్థాయిలో పెరుగుదాల నమోదు చేసిన బంగారం..నిన్న కాస్త ఉపశామించినట్టు కనిపించింది.హమ్మయ్య అనుకునే లోపు ఈరోజు మళ్ళీ...

బంగారం భగ్గుమంది. మొన్న భారీ స్థాయిలో పెరుగుదాల నమోదు చేసిన బంగారం..నిన్న కాస్త ఉపశామించినట్టు కనిపించింది.హమ్మయ్య అనుకునే లోపు ఈరోజు మళ్ళీ భారీస్థాయిలో పెరిగిపోయింది.పది గ్రాముల బంగారం వెయ్యి రూపాయలకు పైగా పెరుగుదలను నమోదు చేసి రికార్డు ధరల్ని నమోదు చేసింది. బంగారం అలా పరుగులు తీస్తుంటే..నేను తక్కువా అన్నట్టు వెండి కూడా రివ్వున దూసుకుపోయింది. కేజీకి పన్నెండు వందల రూపాయలకు పైగానే పెరుగుదల ను నమోదు చేసి ఆకాశంలోకి వెళ్ళిపోయింది.

వరుసగా నాలుగురోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు నిన్న ఇకాస్త తగ్గినట్టు కనిపించినా, ఆ ఆనందాన్ని కొన్ని గంటలు కూడా మిగల్చలేదు. ఈరోజు భారీస్థాయిలో బంగారం ధరలు పెరిగిపోయాయి. ఇక వెండి ధరలు కూడా అదే దారిలో పైకేగాశాయి.. దేశీయంగా ఈరోజు (07.03.2020) బంగారం ధర భారీగా పెర్గింది. హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధరలు జెట్ స్పీడుతో దూసుకుపోయాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 1020 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 45,140 రూపాయల నుంచి 46,160 రూపాయలకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదే స్థాయిలో పెరుగుదల నమోదు చేసింది. 10 గ్రాములకు 950 రూపాయలు పెరిగింది. దీంతో 41,360 రూపాయల నుంచి 42,310 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పైకెగసింది.

భారీగా పెరిగిన వెండి !

బంగారం ధరతో పాటు వెండి ధరలు కూడా భారీ పెరుగుదాల నమోదు చేశాయి. దీంతో శనివారం వెండి ధరలు భారీ స్థాయిలో పెరిఘాయి. వెండి ధర కేజీకి నిన్నటి ధర కంటే 1230 రూపాయలు పెరిగి 49,850 రూపాయల నుంచి 51,080 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా...

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 46,160 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 42,310 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధరలు ఇక్కడా కేజీకి 1230 రూపాయలు పెరిగాయి. దీంతో కెజీ వెండి 51,080రూపాయల వద్దకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు కూడా దూసుకుపోయాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 950 రూపాయలు పెరిగి 44,400 రూపాయల వద్దకు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 950 రూపాయలు పెరుగుదల నమోదు చేసి 43,200 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా భారీగా పెరిగి 51,080 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07-03-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories