Gold Rate: వారం అంతా పైకెగసిన బంగారం ధరలు!

Gold Rate: వారం అంతా పైకెగసిన బంగారం ధరలు!
x
Highlights

గడిచిన వారంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. దాదాపు ప్రతి రోజూ పెరుగుతూనే వచ్చాయి. మార్చి 21 నుంచి 27 వరకూ చూసుకుంటే బంగారం ధర పది గ్రాములకు దాదాపుగా...

గడిచిన వారంలో బంగారం ధరలు ఆకాశాన్ని అంటాయి. దాదాపు ప్రతి రోజూ పెరుగుతూనే వచ్చాయి. మార్చి 21 నుంచి 27 వరకూ చూసుకుంటే బంగారం ధర పది గ్రాములకు దాదాపుగా 2000 రూపాయలకు పైగా పెరుగుదల నమోదు చేసింది. ఈ ఏడూ రోజుల్లోనూ కేవలం మార్చి 23 వ తేదీన మాత్రమె బంగారం ధరల్లో కొద్దిగా తగ్గుదల నమోదు అయింది. మిగిలిన ఆరు రోజులు పెరుగుతూనే పోవడంతో బంగారం ధర చుక్కలనంటింది.

మర్చి 21 వ తేదీన 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 39,660 గా ఉండగా అది వారాంతానికి అంటే మర్చి 27 నాటికి 41,770 రూపాయలకు చేరుకుంది. అంటే 2,110 రూపాయలు పెరిగింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా అదేవిధంగా పైకెగసింది. మర్చి 21 వ తేదీన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 43,270 రూపాయలుగా ఉండగా అది వారాంతానికి అంటే మర్చి 27 నాటికి 45,300 రూపాయలకు చేరుకుంది. అంటే 2,070 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో గత వారం మొత్తం బంగారం ధరల్లో పెరుగుదల నమోదు అయినట్టయింది.

మార్చి 21 నుంచి 27 వరకూ బంగారం ధరలు ఇలా నమోదయ్యాయి.

- మార్చి 21, 2020 -22 క్యారెట్ల బంగారం 39,660 -24 క్యారెట్ల బంగారం 43,270

- మార్చి 22, 2020 -22 క్యారెట్ల బంగారం 39,670 -24 క్యారెట్ల బంగారం 43,280

- మార్చి 24, 2020 -22 క్యారెట్ల బంగారం 40,073 -24 క్యారెట్ల బంగారం 43,620

- మార్చి 23, 2020 -22 క్యారెట్ల బంగారం 39,700 -24 క్యారెట్ల బంగారం 43,310

- మార్చి 25, 2020 -22 క్యారెట్ల బంగారం 41,080 -24 క్యారెట్ల బంగారం 44,630

- మార్చి 26, 2020 -22 క్యారెట్ల బంగారం 41,260 -24 క్యారెట్ల బంగారం 44,810

- మార్చి 27, 2020 -22 క్యారెట్ల బంగారం 41,770 -24 క్యారెట్ల బంగారం 45,300

దేశవ్యాప్తంగా బంగారం ధరల సరళిని అనుసరించి ఇక్కడ ధరలు పేర్కొనడం జరిగింది. ఇవి ఆయా ప్రాంతాలలో ఉండే పరిస్థితులను బట్టి కొద్దిగా మార్పులు ఉండవచ్చును. మొత్తమ్మీద బంగారం ధరలో గతవారంలో వచ్చిన మార్పులను ఈ పట్టిక సూచిస్తుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories