బంగారం కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్..

బంగారం కొనుగోలు దారులకు బ్యాడ్ న్యూస్..
x
Highlights

కొంతకాలంగా పడి లేస్తున్న పసిడి ధరలు ప్రస్తుతం అమాంతం పెరిగాయి. కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఉత్పత్తి తగ్గింది. దాంతో ధర పరుగులు పెడుతోంది....

కొంతకాలంగా పడి లేస్తున్న పసిడి ధరలు ప్రస్తుతం అమాంతం పెరిగాయి. కొంతకాలంగా అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ఉత్పత్తి తగ్గింది. దాంతో ధర పరుగులు పెడుతోంది. స్థానిక నగల వ్యాపారుల నుంచి డిమాండ్ పెరుగుతుండడం కూడా ధరలు పెరగడానికి మరో కారణం. గురువారంబంగారం ధర రూ.33 వేలకు చేరుకుంది. పది గ్రాములకు రూ.270 పెరిగి రూ.33,070కి ఎగిసింది. మరోవైపు వెండి కూడా కిలోకు రూ.410 పెరిగి రూ.40,510కి చేరింది. డిమాండ్ పెరగడమే ధర పెరుగుదలకు కారణమని బులియన్ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో 99.9 స్వచ్ఛత కలిగిన బంగారం ధర పది గ్రాములకు రూ.270 పెరిగి రూ.33,070కి చేరుకుంది. అలాగే ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరిగి రూ. 25,300కు చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories