Top
logo

Gold Rates Today: దీపావళి ముందు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!

Gold Rates Today: దీపావళి ముందు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధరలు!
Highlights

రెండు రోజులుగా 40 వేలరూపాయల చేరువలో ఉన్న బంగారం ధరలు ఈరోజు బాగా తగ్గాయి. శనివారం దేశీయంగా బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయలు తగ్గి 39,720 రూపాయలుగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 260 రూపాయలు తగ్గి 36,390 రూపాయలకు దిగి వచ్చింది.

రెండు రోజులుగా 40 వేలరూపాయల చేరువలో ఉన్న బంగారం ధరలు ఈరోజు బాగా తగ్గాయి. శనివారం దేశీయంగా బంగారం ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 160 రూపాయలు తగ్గి 39,720 రూపాయలుగా ఉంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 260 రూపాయలు తగ్గి 36,390 రూపాయలకు దిగి వచ్చింది. ఇక వెండి ధరలోనూ మార్పులు చోటు చేసుకోలేదు. కేజీ వెండి ధర 48,500 రూపాయల వద్ద నిలకడగా ఉంది. అయితే శుక్రవారం క్లోజింగ్ సమయానికి కొద్దిగా ముందు ధర కేజీకి 100 రూపాయలు పెరిగి 48,600 వద్దకు చేరింది. అయితే ఈరోజు శనివారం మళ్ళీ యధాతథంగా కేజీ బంగారం ధర 48,500 రూపాయలుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,720, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,390 రూపాయలుగానూ ఉన్నాయి.

ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా 290 రూపాయలు తగ్గి 38,210 రూపాయలకు పడిపోయింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 290 రూపాయలు తగ్గి 37,160 రూపాయలకు పడింది. ఇక కేజీ వెండి ధర కూడా ఎలాంటి మార్పులు లేకుండా 48,500 రూపాయలవద్ద నిలిచింది.Next Story