Best Mileage Bikes: ఎక్కువ మైలేజ్ ఇచ్చే 4 అద్భుతమైన బైక్‌లు.. తక్కువ ధరలోనే..!

భారతీయ మార్కెట్లో యువత కార్లతో పాటు బైక్‌లపై కూడా బాగా మోజు చూపిస్తుంటారు. దేశంలో చాలా మంది ప్రజలు తక్కువ దూరాలకు, రోజువారీ జీవితంలో ద్విచక్ర వాహనాలను ఉపయోగించటానికి ఇష్టపడుతుంటారు.

Jyothi
Updated on: 28 April 2023 9:48 PM IST
From HF Deluxe TVS Sport to These 4 Best Mileage Bikes in India
X

Best Mileage Bikes: ఎక్కువ మైలేజ్ ఇచ్చే 4 అద్భుతమైన బైక్‌లు.. తక్కువ ధరలోనే..!

Cheap and Best Bikes In India: భారతీయ మార్కెట్లో యువత కార్లతో పాటు బైక్‌లపై కూడా బాగా మోజు చూపిస్తుంటారు. దేశంలో చాలా మంది ప్రజలు తక్కువ దూరాలకు, రోజువారీ జీవితంలో ద్విచక్ర వాహనాలను ఉపయోగించటానికి ఇష్టపడుతుంటారు. ఈ కారణంగానే ఎక్కువ మైలేజీని ఇచ్చే బైకులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రోజు ఎక్కువ మైలేజీని అందించే 4 బైక్‌ల గురించి తెలుసుకుందాం.

1. TVS స్పోర్ట్..

టీవీఎస్ స్పోర్ట్ మార్కెట్‌లో ఎక్కువగా అమ్ముడవుతోన్న బైక్. ఈ బైక్‌లో 109.7cc BS6 ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 8.18 bhp శక్తిని, 8.7 NM టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. దీనికి రెండు డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. ఈ బైక్ మార్కెట్‌లో మూడు వేరియంట్‌లు, ఏడు రంగులలో అందుబాటులో ఉంది. ఇందులో 10 లీటర్ల పెట్రెల్ ట్యాంక్ కూడా అందుబాటులో ఉంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 61,025 నుంచి రూ. 67,530 వరకు అందుబాటులో ఉంది. ఇది 70kmpl మైలేజీని అందిస్తుంది.



2. హీరో HF డీలక్స్..

హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ 7.91 బీహెచ్‌పీ పవర్, 8.05ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేసే 97.2సీసీ BS6 ఇంజన్‌ను అందించారు. ఈ బైక్ ముందు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు అందించారు. మీరు ఈ బైక్‌ను 5 వేరియంట్లు, 10 రంగులలో మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది 9.1 లీటర్ల పెట్రోల్ ట్యాంక్‌ను అందించారు. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 55,022 నుంచి రూ 67,178 వరకు ఉంటుంది. ఇది 65kmpl మైలేజీని అందిస్తుంది.



3. హోండా SP 125..

హోండా SP 125 బైక్‌లో 124cc BS6 ఇంజన్ లభిస్తుంది. ఇది 10.72bhp పవర్, 10.9NM టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లతో కలిపి బ్రేకింగ్ సిస్టమ్‌ను కూడా అందించారు. ఈ బైక్ రెండు వేరియంట్లతోపాటు 5 రంగులలో మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది 11 లీటర్ పెట్రోల్ ట్యాంక్‌ను కలిగి ఉంది. ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 83,088 నుంచి రూ. 69,702 వరకు ఉంటుంది. ఇది 65kmpl మైలేజీని ఇస్తుంది.



4. Honda Livo..

Honda Livo రెండు వేరియంట్లు, 4 రంగులలో మార్కెట్‌లో దొరుకుతుంది. ఇది 109.51cc BS6 ఇంజిన్‌ను పొందుతుంది. ఇది 8.67bhp శక్తిని, 9.30Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. బైక్‌కు ముందు, వెనుక భాగంలో డ్రమ్ బ్రేక్‌లు, కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఈ బైక్‌లో 9 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ అందించారు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 75,659. ఇది 60kmpl మైలేజీని ఇష్తుంది.



Jyothi

Jyothi

Next Story