ఫ్లిప్‌కార్ట్‌లో ఇయర్ ఎండ్ సేల్..త్వరపడండి

ఫ్లిప్‌కార్ట్‌లో ఇయర్ ఎండ్ సేల్..త్వరపడండి
x
Highlights

పాత సంవత్సరానికి బై చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పడానికి కౌంట్ డౌన్ మొదలయింది.

పాత సంవత్సరానికి బై చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్ కమ్ చెప్పడానికి కౌంట్ డౌన్ మొదలయింది. ఈ నూతన సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా కొన్ని సంస్థలు మంచి ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. కొత్త సంవత్సరంలో కొత్త వస్తువులతో ఆనందంగా గడిపేయవచ్చు. ఇక ఈ సందర్భంగా స్మార్ట ఫోన్ ప్రియులకోసం ఆఫర్లను ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ అందించనుంది. తన సైట్‌లో డిసెంబర్ 21 నుంచి 23వ తేదీ వరకు ఇయర్ ఎండ్ సేల్‌ను నిర్వహించనుంది.

స్మార్ట్ పోన్ల విషయానికొస్తే శాంసంగ్ గెలాక్సీ ఎస్9, హానర్ 9ఎన్, అసుస్ 5జడ్, ఒప్పో ఎఫ్11 ప్రొ, గూగుల్ పిక్సల్ 3ఎ ఎక్స్‌ఎల్, గెలాక్సీ ఎ50, ఒప్పో ఎఫ్11, గూగుల్ పిక్సల్ 3, హానర్ 10 లైట్ తదితర ఫోన్లను తగ్గింపు ధరలకు అందివ్వనున్నారు. అంతే కాదు ఈ ఫోన్లను ఐసీఐసీ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను అందివ్వనున్నారు. మరింకెందుకు ఆలస్యం ఇప్పుడే కొత్త ఫోన్ను మీ సొంతం చేసుకొని నూతన సంవత్సరంలో సరదాగా ఆనందించండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories