మెసెంజ‌ర్‌ వాడాలంటే ఫేస్‌బుక్ ఉండాల్సిందే..!

మెసెంజ‌ర్‌ వాడాలంటే ఫేస్‌బుక్ ఉండాల్సిందే..!
x
Highlights

ఒకప్పటి కాలంలో ఒక సమాచారాన్ని ఒకరికి చేరవేయాలంటే లెటర్ల ద్వారా సందేశాన్ని పంపించేవారు. కానీ టెక్నాలజీ పెరిగిపోయింది ఏదైనా సమాచారం అందించాలంటే ఒక్క...

ఒకప్పటి కాలంలో ఒక సమాచారాన్ని ఒకరికి చేరవేయాలంటే లెటర్ల ద్వారా సందేశాన్ని పంపించేవారు. కానీ టెక్నాలజీ పెరిగిపోయింది ఏదైనా సమాచారం అందించాలంటే ఒక్క క్షణం చాలు అలా ప్రపంచం అంతా పాకిపోతుంది. అలా సందేశాలని ప్రపంచ వ్యాప్తంగా తెలియజేసేదే సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ ఫేస్‌బుక్. ఇప్పటి వరకూ చాలా మంది ఫేస్బుక్ అకౌంట్ లేకుండా కేవలం ఫోన్ నంబర్ ద్వారానే మెసెంజర్ ని ఓపన్ చేసి సందేశాలని పంపించుకునేవారు. అంతే కాక లక్షల సంఖ్యలో ప్రజలు ఈ ఫేస్ బుక్ ను ఉపయోగించి మెసెంజర్ ద్వారా సమాచారాన్ని షేర్ చేసేవారు.

కానీ ఇప్పుడు ఈ ఫేస్ బుక్ అకౌంట్ ను కొత్తగా ఇన్ స్టాల్ చేసుకుని త‌న మెసెంజర్ యాప్‌ను కొత్తగా ఉప‌యోగించే వారికి నూత‌న నిబంధ‌న‌ను, షరతులను అమ‌లులోకి తెచ్చింది. ఇక‌పై మెసెంజ‌ర్‌ను వాడాలంటే త‌ప్పనిస‌రిగా ఫేస్‌బుక్ అకౌంట్ ఉండాల్సిందే. అకౌంట్ ను గనుక ఎవరైనా ఇన్ స్టాల్ చేసుకోనట్లయితే వారికి మెసెంజర్ పనిచేయదని స్పష్టం చేసారు. మెసెంజర్ ద్వారా మెసేజ్ లను పంపించాలనుకునే వారు ఎట్టి పరిస్థితిలోనూ ఫేస్‌బుక్ అకౌంట్‌తోనే మెసెంజర్ లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒక వేల ఫేస్‌బుక్ ఖాతాను మొదలు పెట్టుకుంటే య‌థావిధిగా ఈ యాప్‌ను ఉప‌యోగించుకోవ‌చ్చని ఫేస్‌బుక్ తెలిపింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories