మళ్ళీ షాకిచ్చిన బంగారం.. పరుగు ఆపని వెండి!

మళ్ళీ షాకిచ్చిన బంగారం.. పరుగు ఆపని వెండి!
x
Highlights

బంగారం ఇంవేస్తార్లతో..వినియోగదారులతో దోబూచులాట ఆడుతోంది. అప్పుడే కిందకి జారిపోతుంది.. అప్పటికప్పుడే పైకెగస్తుంది. మొన్న భారీగా పెరిగి షాక్ ఇచ్చిన...

బంగారం ఇంవేస్తార్లతో..వినియోగదారులతో దోబూచులాట ఆడుతోంది. అప్పుడే కిందకి జారిపోతుంది.. అప్పటికప్పుడే పైకెగస్తుంది. మొన్న భారీగా పెరిగి షాక్ ఇచ్చిన బంగారం.. నిన్న కిందకి జారిపోయింది. ఆ సరదా కొద్దిసేపు కూడా లేకుండానే.. ఒక్కసారిగా ఆదివారం పైకేగాశాయి. నిన్న తగ్గుదల నమోదు చేసిన బంగారం ఈరోజు (02.02.2020) భారీగా పెరిగింది.బడ్జెట్ నేపధ్యంలో బంగారం పై ఇన్వెస్ట్ చేయడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపడంతో బంగారం ధరలు పై చూపులు చూశాయి.

భారీగా పెరిగిన బంగారం..

హైదరాబాద్ మార్కెట్లో ఆదివారం బంగారం ధరలు భారీగా ఎగశాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 420 రూపాయలు పెరిగింది. 24 రెట్ల బంగారం పది గ్రాములకు 42,330 నుంచి 42,750 రూపాయలకు పెరిగింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా భారీ పెరుగుదల నమోదు చేసింది. పది గ్రాములకు 420 రూపాయలు తగ్గడంతో 38,800 నుంచి 39,220 రూపాయల వద్దకు చేరుకుంది. Also Read - Union Budget 2020: బడ్జెట్ లైవ్ అప్డేట్స్

ఆగని వెండి పరుగులు..

ఒకవైపు బంగారం ధరలు అటూ ఇటూ మారుతూ వతున్నా.. వెండి ధరలు మాత్రం పరుగులు తీస్తూనే ఉన్నాయి. ఈరోజు కేజీకి 140 రూపాయలు వెండి ధర పెరిగింది. దీంతో వెండి ధరలు కేజీకి 49,990 రూపాయల వద్దకు ఎగశాయి.

విజయవాడ, విశాఖపట్నం లోనూ ఇదేవిధంగా..

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,750 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,220 రూపాయలుగా నమోదయ్యాయి. ఇక ఇక్కడ కూడా వెండి ధర 49,990 రూపాయల వద్ద నిలిచింది.

దేశరాజధాని ఢిల్లీలోనూ..

ఇక ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పెరుగుదల నమోదు చేశాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఇక్కడా 370 రూపాయలు పెరిగింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 41,220 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 400 రూపాయల పెరుగుదల నమోదు చేసి 40,050 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా పెరిగింది. దాంతో వెండి ధర కేజీకి 49,990 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 02.02.2020 ఉదయం 6 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories