Budget 2020 : ఈ సంవత్సరం బడ్జెట్ లో పన్నుల ఊరట ఉండకపోవచ్చా?

Budget 2020 : ఈ సంవత్సరం బడ్జెట్ లో పన్నుల ఊరట ఉండకపోవచ్చా?
x
Highlights

కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 1, 2020 న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడ్తారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఒక...

కేంద్ర బడ్జెట్ ను ఫిబ్రవరి 1, 2020 న కేంద్ర బడ్జెట్ ప్రవేశ పెడ్తారు. కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఒక వైపు ఆర్ధిక మందగమాంమ్..మరో వైపు ప్రజల ఆశలు.. వీటిని నిర్మలా సీతారామన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో మోడీ సర్కారు చాలా చర్యలు చేపట్టింది. వాటిలో భాగంగా వివిధ రంగాలకు ఉద్దీపనలు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.

ఈ వరుసలోనే వేతన జీవులకు కూడా మేలు కలిగించేలా బడ్జెట్లో చర్యలుంటాయని అందరూ భావిస్తున్నారు. ముఖ్యంగా సామాన్యులు శుభవార్తలు కోసం నిర్మల సీతారామన్ వైపు చూస్తున్నారు. కార్పొరేట్ పన్నులను ప్రభుత్వం బడ్జెట్ లో తగ్గించే అవకాశం ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే, ఇప్పటికే కార్పొరేట్ పన్నుల మినహాయింపు ఖజానా పై 1.45 లక్షల కోట్ల భారం పడింది. అందుకే ఇప్పుడు ఈ భారాన్ని మరింత పెంచుకోవడానికి సర్కార్ ప్రయత్నించకపోవచ్చని వారి అంచనా.

ఇక సామాన్యులకు సంబంధించి పీఎఫ్ కంట్రిబ్యూషన్, ఆదాయపు పన్ను రేట్లలో తగ్గింపు ఉండవచ్చని అనుకుంటున్నా, అది ఎంత వరకూ ఉంటుందన్న విషయం అంచనాకు అందడం లేదు. వేతన జీవులకు ఊరట కలిగించేలా సీతారామన్ బడ్జెట్ ఉంటుందా అనేది ప్రశ్నఅర్థకమే అని నిపుణులు చెబుతున్నారు. వారి అంచనా ప్రకారం పెద్దగా ఈ విషయంలోనూ ఊరట కలిగించే అంశాలు ఉండబోవని అనుకుంటున్నారు. అయితే, వేతన జీవులకు పన్ను మినహాయింపు విషయంలో కొద్దిగా ఆలోచన చేయొచ్చని వారు భావిస్తున్నారు.

గత ఏడాది మోడీ ప్రభుత్వం జీఎస్టీ పై చాలా ఊరట కల్పించింది. చాలా వస్తువులపై జీఎస్టీ రేటును తగ్గించడమే కాకుండా అధిక జీఎస్టీ సలాబుల నుంచి తక్కువ జీఎస్టీ స్లాబ్స్ కు తీసుకువచ్చింది. ఒకవైపు కార్పొరేట్ పన్ను మినహాయింపు.. మరోవైపు జీఎస్టీ తగ్గింపులకు తోడుగా ఆర్ధిక మందగమనం ఉండడంతో వసూళ్లు తగ్గాయి. దీంతో ప్రభత్వ ఆదాయాలకు గండి పడినట్లయింది. ఆదాయ లక్ష్యాలను చేరుకోవడంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం పన్నుల విషయంలో పెద్దగా తగ్గింపులు ఉండకపోవచ్చని కొందరు ఆర్ధిక నిపుణులు అంటున్నారు. అయితే, సామాన్య ప్రజలు మాత్రం మోడీ సర్కారు తమకు బడ్జెట్ లో వరాలు ఇస్తుందనే ఆశతో ఉన్నారు. వారికి ఆర్థిక మందగమనం, జీఎస్టీ వెసులుబాటు వంటి అంశాలపై అవగాహన ఉండకపోవడంతో ప్రభుత్వ బడ్జెట్ పై గంపెడాశలతో ఉన్నారు.

మోడీ ప్రభుత్వం గత ఏడాది (2019)లో కార్పోరేట్ పన్ను తగ్గించింది. స్టార్టప్స్‌కు ఏంజెల్ ట్యాక్స్, వ్యాపారులకు జీఎస్టీ, ఫారన్ పోర్ట్ పోలియో ఇన్వెస్టర్లకు సర్‌ఛార్జ్ వంటి వాటిల్లో భారీ ఊరట కల్పించింది. ఈ నేపథ్యంలో వేతనజీవులకు ఈ బడ్జెట్‌లో పన్ను ఊరట ఉండే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. గత బడ్జెట్‌లో రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను చెల్లింపులు లేదని ప్రతిపాదించారు. స్టాండర్డ్ డిడక్షన్ ఏడాదికి రూ.40,000 నుంచి రూ.50,000కు పెంచారు. ఇప్పుడు మరిన్ని ప్రోత్సాహకాలు ఉండాలని కోరుకుంటున్నారు.

కార్పొరేట్ పన్ను విషయంలో మోడీ సర్కారు ఈ ఏడాది జాలి చూపించే అవకాశాలు లేవని చెప్పొచ్చంటున్నారు ఆర్ధిక నిపుణులు. కాకపొతే, ఆదాయపు పన్ను విషయంలో కొంత వెసులుబాటు ఇచ్చే అవకాశం కనిపిస్తోందని వారంటున్నారు. ఎందుకంటే, వినియోగం తగ్గడం వలన ఆదాయపు పన్ను తగ్గిస్తే మరికొంత సొమ్ములు వ్యవస్థలోకి వచ్చి వినియోగం పెరిగే ఛాన్స్ ఉంటుందని వారి అంచనా. మొత్తమ్మీద టాక్స్ ల విషయంలో మోడీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే సూచనలే కనబడుతున్నాయని ఆర్ధిక వేత్తలు అంటున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories