Banks Strike: మార్చి రెండో వారంలో వరుసగా ఆరురోజులు బ్యాంకులకు సెలవులు

Banks Strike: మార్చి రెండో వారంలో వరుసగా ఆరురోజులు బ్యాంకులకు సెలవులు
x
Highlights

మర్చి నెలలో రెండో వారం మొత్తం దాదాపుగా బ్యాంకులు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయస్థాయిలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు కొంత కాలంగా తమ జీతాల...

మర్చి నెలలో రెండో వారం మొత్తం దాదాపుగా బ్యాంకులు మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జాతీయస్థాయిలో ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు కొంత కాలంగా తమ జీతాల పెంపుదల కోసం గట్టిగానే పోరాటం చేస్తూ వస్తున్నాయి. ఇందులో భాగంగా బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బిఏఎఫ్ఐ) ఇచ్చిన పిలుపు మేరకు మార్చి రెండోవారంలో తరిగి సమ్మె చేపట్టాలని నిర్ణయించారు. దీంతో మార్చి రెండో వారంలో బ్యాంకులు వరుసగా ఆరురోజులు పని చేసే అవకాశం కనిపించడం లేదు.

ఈ నెలలో (ఫిబ్రవరి) చివరి వారంలో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. శివరాత్రి కారణంగా శుక్రవారం (21) నుంచి ఆదివారం (23) వరకూ వరుస సెలవులు వచ్చాయి. ఇక మార్చి నెలలో సమ్మె కారణంగా వరుసగా ఆరురోజుల పాటు సెలవులు వచ్చె అవకాశం ఉంది.

తమ వేతనాలు పెంచాలంటూ మార్చి 11 నుంచి 13 వరకూ దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని BEFI, IEBEA లతో పాటు పలు బ్యాంకు సంఘాలు పిలుపునిచ్చాయి. ఉద్యోగుల సంఘాలు 20 శాతం వేతనాన్ని పెంచాలని పట్టుపడుతున్నాయి. అయితే, ఉద్యోగ సంఘాలు మాత్రం 12.5 శతం వరకూ మాత్రమె పెంచాగాలమని చెబుతూ వస్తున్నాయి. గతంలో ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్ చొరవతో జరిపిన చర్చల్లో యాజమాన్యాలు 12.5 శాతం మేర మాత్రమె జీతాలు పెంచే అవకాశం ఉందని స్పష్టం చేశాయి. అయితే, ఉద్యోగ సంఘాలు మాత్రం దీనికి అంగీకరించడం లేదు. అంతే కాకుండా వారానికి ఐదు రోజులు పని దినాలు ఉండాలని బ్యాంకు ఉద్యోగులు కోరుతున్నారు. అయితే, దీనికి యాజమాన్యాలు అంగీకరించడం లేదు. ఇప్పటికే నెలలో రెండవ, నాల్గవ శనివారం సెలవు ఇస్తున్నందున, అన్ని వారాలు రెండేసి రోజులు సెలవులు వస్తే ప్రజలు ఇబ్బంది పడతారని యాజమాన్యాలు దీనికి అంగీకరించడం లేదు.

ఇదిలా ఉంటె ఈసారి సమ్మెకు మార్చి 11 నుంచి 13 వరకూ పిలుపు నిచ్చాయి ఉద్యోగ సంఘాలు. అంటే, ఒకవేళ సమ్మె జరిగితే, మార్చి 8 వ తేదీ ఆదివారం సెలవు. 9 వ తేదీ సోమవారం బ్యాంకులు పనిచేస్తాయి. 10 వ తేదీ హోలీ పండుగ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఇక 11,12, 13 తేదీలలో సమ్మె కారణంగా బ్యాంకులు మూత పడతాయి. అంటే బుధ, గురు, శుక్ర వారాల్లో సమ్మె ప్రభావం ఉంటుంది. ఇక 14 వ తేదీ రెండో శని వారం..15 వ తేదీ ఆదివారం.. రెండు రోజులూ బ్యాంకులకు సెలవులు. ఇలా చూస్తె మార్చి రెండో వారం మొత్తంలో కేవలం సోమవారం మాత్రమె బ్యాంకులు పనిచేస్తాయి. మార్చి 8 ఆదివారం నుంచి మార్చి 15 ఆదివారం వరకూ ఆరురోజుల పాటు బ్యాంకులు పనిచేసే అవకాశాలు ఉండవు.

అయితే, ఈ సమ్మె తేదీలు ప్రస్తురం ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. మార్చి 5 వ తేదీన కేంద్ర లేబర్ కమిషనర్ వద్ద చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో ఫలితాల్ని బట్టి సమ్మె తేదీలు ఖరారవుతాయి. ఇక ఈ సంవత్సరం లో ఇప్పటికే రెండుసార్లు బ్యాంకులు సమ్మె కారణంగా మూట పడ్డాయి. జనవరి నెలలో 8, 9, 31 తేదీల్లో, ఫిబ్రవరి నెల 1న సమ్మె కారణంగా బ్యాంకులు పనిచేయని సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories