మళ్లీ మార్కెట్ లోకి బజాజ్ చేతక్

మళ్లీ మార్కెట్ లోకి బజాజ్ చేతక్
x
Highlights

కొన్ని సంత్సరాల కిందట హమారా బజాజ్, హమారా చేతక్ అనే ఒక ప్రకటనను అందరూ వినే ఉంటారు. అప్పటి కాలంలో స్కూటర్ల రాజ్యంలోనే బజాజ్ చేతక్ ఒక ఊపు ఊపింది. కానీ...

కొన్ని సంత్సరాల కిందట హమారా బజాజ్, హమారా చేతక్ అనే ఒక ప్రకటనను అందరూ వినే ఉంటారు. అప్పటి కాలంలో స్కూటర్ల రాజ్యంలోనే బజాజ్ చేతక్ ఒక ఊపు ఊపింది. కానీ కాలానుగుణంగా కొత్త మోడల్ లో ద్విచక్ర వాహణాలు రావడంతో బజాజ్ చేతక్ కనుమరుగైంది.

కానీ ఇప్పుడు బజాజ్ కంపెనీ వాళ్లు మళ్లీ చేతక్ ను మార్కెట్ లోకి ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తుంది. మారిన కాలానికి అనుగుణంగా కొత్త హంగులతో దీన్ని రూపొందించనుంది. ఈ టూవీలర్ ని ఈ సారి ఎలక్ట్రిక్ వెర్షన్ గా మార్కెట్లోకి తేనున్నారు. దీనికి అమర్చిన లిథియం అయాన్ బ్యాటరీ సుమారు 70,000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుందని బజాజ్ కంపెనీ వర్గాలంటున్నాయి. ఈ బ్యాటరీ 5 గంటల్లోనే 80 శాతం వరకు చార్జింగ్ అతుందని తెలిపారు. అంతే కాక అల్లాయ్ వీల్స్, సరికొత్త ఎల్ఈడీ హెడ్ ల్యాంప్ లాంటి కొత్త ప్రత్యేకతలతో వాహణదారల ముందుకు రానుంది.

ప్రస్తుతానికి చేతక్ ను మహారాష్ట్రలోని చకన్ యూనిట్ లో తయారుచేస్తున్నారని తెలిసింది. కానీ వీటిలో ఓ ట్విస్ట్ అది ఏంటంటే అన్నీ సరిగ్గానే ఉన్నప్పటికీ ఈ వాహనం ధర మాత్రం ఎంత అన్నది ఇప్పటి వరకు తెలుపలేదు. నూతన హంగులతో మార్కెట్ లోకి రానున్న ఈ బజాక్ చేతక్ కు ఎంత మేర ఫాన్స్ పెరగబోతున్నారో వేచి చూడాల్సిందే.Show Full Article
Print Article
More On
Next Story
More Stories