ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక తిరోగమనం.. భారత్ జీడీపీ మాత్రం ముందడుగే అంటున్న ఐఎంఎఫ్!

ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక తిరోగమనం.. భారత్ జీడీపీ మాత్రం ముందడుగే అంటున్న ఐఎంఎఫ్!
x
Indian economy (representational image)
Highlights

కరోనా కల్లోలం చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. ఒకవైపు ప్రజల ఆరోగ్యాలతో నేరుగా ఆడుకుంటోంది. మరోవైపు దేశాల ఆర్ధిక స్థితిగతుల్ని పూర్తిగా కుదేలు...

కరోనా కల్లోలం చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు. ఒకవైపు ప్రజల ఆరోగ్యాలతో నేరుగా ఆడుకుంటోంది. మరోవైపు దేశాల ఆర్ధిక స్థితిగతుల్ని పూర్తిగా కుదేలు చేసేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించాయి. కంటికి కనిపించని కరోనా పై ఆయా దేశాలు అలుపెరుగని పోరాటం చేస్తున్నాయి. అయితే, ఈ మహమ్మారి ఓ పట్టాన లొంగడం లేదు. ఇక లాక్ డౌన్ తో చాలా దేశాలు స్తంభించిపోయాయి. ఈ నేపధ్యంలో ఆయా దేశాల ఆర్ధిక వృద్ధి రేటు(జీడీపీ) గణనీయంగా పడిపోయింది. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ 1930 తర్వాత ఇప్పుడే ఇంత తీవ్రంగా స్తంభించింది.

ఇక భారత దేశంలో 40 రోజుల పాటు లాక్ డౌన్ విధించడం వాళ్ళ దేశానికి లక్షల కొట్లలో నష్టం వస్తోంది. ఈ ప్రభావంతో భారత దేశ జీడీపీ 2020 లో 1.9 శాతానికి పరిమితం అవుతుందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఇది 1991లో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తరువాత మొదటి తక్కువ వృద్ధి రేటు కావడం గమనార్హం. అయితే, ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత ఆర్ధిక వ్యవస్థ వేగంగా పురోగతి సాధిస్తోందని ఇటీవల ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎమ్ఎఫ్) ప్రకటించింది.

ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం 2020 లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు మైనస్ 3 శాతానికి పడిపోతుంది. ఇక అభివృద్ధి చెందిన దేశాలుగా చెప్పుకుంటున్నా అమెరికా (-5.2 శాతం), యూకే (-6.5 శాతం), జర్మనీ (-7 శాతం), ఫ్రాన్స్ (-7.2 శాతం), ఇటలీ (-9.1 శాతం), స్పెయిన్ (-8.0 శాతం) దేశాల ఆర్ధిక ప్రగతి పూర్తిగా వెనక్కు వెళ్ళిపోతుందని చెబుతున్నారు. ప్రపంచంలో రెండే దేశాలు మాత్రం ఇంత ఒత్తిడిలోనూ పాజిటివ్ గ్రోత్ రేట్ సాధిస్తాయని ఐఎంఎఫ్ చెబుతోంది. ఆ లెక్కల ప్రకారం చైనా జీడీపీ 1.2 శాతం, భారత జీడీపీ 1.9 శాతం అభివృద్ధి సాధిస్తాయని తెలుస్తోంది. అదేవిధంగా దక్షిణాసియా ఎకనామిక్ ఫోరం గతంలో 2021 లో భారత జీడీపీ 7.4 శాతం, చైనా జీడీపీ 9.2 శాతం, అమెరికా జీడీపీ 4.5 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా వేసింది. అయితే, కరోనా కారణంగా మారిన పరిస్థితుల్లో మూడు నెలల్లో పరిస్థతి మారిపోయింది. ప్రస్తుత అంచనాల ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 1.5 శాతం నుంచి 2.8 శాతం వరకు వృద్ధి కనబరుస్తుందని ఆ సంస్థ చెబుతోంది. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత పరిస్థితిలో ఈ అంచనాలు భారత్ కు కొంచెం ఊరట నిచ్చేవిగా చెప్పవచ్చు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories