ఇండియాలోను ఆపిల్ ఐ ప్యాడ్లల విక్రయం

ఇండియాలోను ఆపిల్ ఐ ప్యాడ్లల విక్రయం
x
Highlights

సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఆపిల్ సంస్థ ఇటీవలే 7వ జనరేషన్ ఐప్యాడ్ (2019)ను విడుదల చేసిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఐప్యాడ్‌ల విక్రయాలను ఇప్పుడు భారత్‌లోనూ ప్రారంభించారు.

పెరుగుతున్న టెక్నాలజీని దృష్టిలో పెట్టుకుని సాఫ్ట్‌వేర్ సంస్థల్లో దిగ్గజమైన ఆపిల్ ఇప్పుడు మరో కొత్త ఐపాడ్ ని ప్రవేశ పెట్టింది. ఇప్పుడు ఈ ఐపాడ్ విక్రయాలను భారత్ లోను ప్రారంభించింది. ఆపిల్ సంస్థ ఇటీవలే 7వ జనరేషన్ ఐప్యాడ్ (2019)ను విడుదల చేసిందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ ఐప్యాడ్‌ల విక్రయాలను ఇప్పుడు భారత్‌లోనూ ప్రారంభించారు. ఈ ఐప్యాడ్‌కు చెందిన 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.48,900 గా ఉండగా, వైఫై వేరియెంట్ 32జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.29,900 ఉంది.

128 జీబీ మోడల్ ధర రూ.37,900గా, అలాగే వైఫై+సెల్యులార్ వేరియెంట్ 32 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.40,900 ఉండగా, ఈ ఐప్యాడ్‌లో 10.2 ఇంచుల డిస్‌ప్లే, ఆపిల్ ఎ10 ఫ్యుషన్ ప్రాసెసర్, 32/128 జీబీ స్టోరేజ్, ఐఓఎస్ 13, 8, 1.2 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ ఎల్టీఈ (ఆప్షనల్), బ్లూటూత్ 4.2, డ్యుయల్ బ్యాండ్ వైఫై, 10 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ ఫీచర్లను అందిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories