అద్దెకు ఐఫోన్లు...

apple i phone
x
apple i phone
Highlights

ఎవరైనా ఇండ్లు, వాహనాలు అద్దెకు ఇవ్వడం చూసాం. కాని ఇప్పుడు యువతకు ఎంతో ఇస్టమైన ఐఫోన్‌ అద్దెకు ఇవ్వాలన్న ఆలోచనలో ఒక సంస్థ వుంది.

ఎవరైనా ఇండ్లు, వాహనాలు అద్దెకు ఇవ్వడం చూసాం. కాని ఇప్పుడు యువతకు ఎంతో ఇష్టమైన ఐఫోన్‌ అద్దెకు ఇవ్వాలన్న ఆలోచనలో ఒక సంస్థ వుంది. నిజంగా ఈ విషయం ఇప్పుడు ఐ ఫోన్ ప్రియులను కలవరపెడుతుంది. అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐఫోన్‌ కొనాలంటే సాధారణ మధ్య తరగతి కుటుంబాలు కొనలేరు. బాగా డబ్బున్న వారే ఈ ఐ ఫోన్ ని కొనగలరు. కాని ఐ ఫోన్ వాడాలన్న కోరిక మాత్రం అందరికీ ఉంటుంది. అందుకే ఆపిల్‌ సంస్థ ఇప్పుడొక సరికొత్త ప్రణాళికను రూపొందించింది. అదేనండి ఐ ఫోన్ కొనలేని వారికోసం ఇక మీదట ఐఫోన్లను అద్దెకు ఇవ్వాలని భావిస్తోంది. ప్రతినెల ఇంటి అద్దె కట్టుకున్నట్టుగానే నెలకు కొంత మొత్తం అమౌంట్ ను చెల్లించి ఐఫోన్‌ను వాడుకోవచ్చు.

అది వాడుకునే సమయంలో మళ్ళీ కంపెనీ నుంచి ఏదైనా కొత్త మోడల్‌ వస్తే ఆ పాత ఫోన్‌ వెనక్కి ఇచ్చి కొత్త ఫోన్ను తీసుకోవోచ్చు. కానీ దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఐఫోన్‌ ను అద్దెకు తీసుకున్నవాళ్లు ఐ ట్యూన్స్‌, ఐ క్లౌడ్‌ వంటి సేవలకు కూడా అదనంగా డబ్బు చెల్లించాలి. ఐ ఫోన్ ప్రియులకోసం దీనికి సంబంధించిన ప్రకటనను త్వరలోనే ఆపిల్‌ సంస్థ విడుదల చేయనుందని సమాచారం.Show Full Article
Print Article
More On
Next Story
More Stories