Debit Card లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చా!

Debit Card లేకుండా డబ్బులు డ్రా చేయొచ్చా!
x
Highlights

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పెరిగిపోతుంది. దీనికి అనుగుణంగానే అన్ని రంగాల్లోనూ మార్పులు వస్తున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ పెరిగిపోతుంది. దీనికి అనుగుణంగానే అన్ని రంగాల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లతోనే బిల్ పేమెంట్స్ చెల్లిస్తున్నారు. అదే విధంగా ఎవరికైనా డబ్బులు అవసరమైతే ఆన్లైన్ లోనే పంపించేస్తు్న్నారు. ఇప్పుడు ఇదే తరహాలో ఒక ప్రముఖ బ్యాంక్ ఒక కొత్త పద్ధతిని తీసుకొచ్చింది. కస్టమర్ల వద్ద ఏటీఎం కార్డు లేకున్నా పర్వాలేదు స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అని చెపుతున్నారు. వింటుంటేనే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. అసలు ఏ బ్యాంకు ఇంత మంచి సదుపాయాన్ని కల్పించింది. దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ ప్రైవేట్ రంగంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్ గా పేరుపొందిన బ్యాంక్ ఐసీఐసీఐ. ఈ బ్యాంకు కస్టరమర్ల సౌకర్యార్థం ఏటీఎం కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రా ఫెసిలిటీని తీసుకొచ్చారు. దీని ద్వారా కస్టమర్లు బ్యాంకు ఏటీఎం కార్డు మర్చిపోయినప్పటికీ డబ్బులను డ్రా చేసుకునే విధంగా సదుపాయాలను కల్పించింది. ఈ సదుపాయాన్ని రోజుకు దాదాపుగా 15,000 మంది ఉపయోగించుకోవచ్చని, రోజుకు రూ.20,000 క్యాష్ ను విత్ డ్రా చేసుకోవచ్చని తెలిపారు.

క్యాష్ ఎలా డ్రా చేసుకోవచ్చు..

ఏటీఎం కార్డు లేకుండా క్యాష్ డ్రా చేయాలనుకునే వారు iMobile app ను తప్పకుండా తమ స్మార్ట్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవాలి. తరువాత ఈ యాప్ లోకి ఎంటర్ అయి సర్వీసెస్‌లోని కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రాయెల్‌పై క్లిక్ చేయాలి. తరవాత సెల్ఫ్ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం అమౌంట్, నాలుగు అంకెల టెంపరరీ పిన్ ఎంటర్ చేయాలి. తరువాత అకౌంట్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎంటర్ చేసిన వివరాలను కన్ఫార్మ్ చేసుకుని, సబ్‌మిట్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. తరువాత మీరు ఎంచుకున్న ఆప్షన్స్ అన్ని సక్సెస్ అయితే డ్రాయి చేసుకునే కస్టమర్లకు ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినట్లు మెసేజ్ వస్తుంది.

తరువాత ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఆరు అంకెల కోడ్ ఎస్ఎంఎస్ వస్తుంది. ఈ ప్రాసెస్ అంతా అయిపోయాక ఐసీఐసీఐ బ్యాంక్ ఏటీఎం సెంటర్‌కు వెళ్లాలి. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, 4 అంకెల టెంపరరీ పిన్, ఆరు అంకెల కోడ్, విత్‌డ్రా అమౌంట్ ఎంటర్ చేయాలి. అంతే మీరు ఎంత అమౌంట్ ను డ్రా చేయాలనుకుంటున్నారో అంత అమౌంట్ మీకు వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఇప్పుడు ఈ పద్ధతిని ప్రయత్నించండి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories