యాక్సిస్ బ్యాంక్ నుంచి 1500 మంది ఉద్యోగులు బయటకు..అసలేం జరుగుతోంది?

యాక్సిస్ బ్యాంక్ నుంచి 1500 మంది ఉద్యోగులు బయటకు..అసలేం జరుగుతోంది?
x
Highlights

దేశంలోని పెద్ద బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ లో ఉద్యోగులు పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎకనామిక్స్ టైమ్స్ కథనం...

దేశంలోని పెద్ద బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంక్ లో ఉద్యోగులు పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఎకనామిక్స్ టైమ్స్ కథనం ప్రకారం గత కొన్ని నెలలో 1500 మంది ఉద్యోగులు యాక్సిస్ బ్యాంక్ ను నుంచి బయటకు వచ్చారు. వారిలో ఎక్కువ భాగం మధ్యస్థాయి, కింది స్థాయి ఉద్యోగుల్ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇటీవల యాక్సిస్ బ్యాంక్ మేనేజిమెంట్ మారింది. కొత్త యాజమాన్యం విధిస్తున్న టార్గెట్స్ అందుకోవడం కష్టంగా మారడంతో ఉద్యోగులు విధుల నుంచి తప్పుకుంటున్నట్టు తెలిసింది. సీనియర్ లెవల్ లోనూ కొంత మంది యాక్సిస్ నుంచి బయటకు వచ్చినా ఆ సంఖ్యా చెప్పుకోదగ్గది కాదు. కానీ, తక్కువ సమయంలో ఇంత ఎక్కువమంది ఉద్యోగులు సంస్థను వదిలి వెళ్లిపోతుండడంతో విశ్లేషకులు రకరకాల అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే, బ్యాంక్ వర్గాలు మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించినట్టు తెలుస్తోంది. కొత్తగా 28,000 మంది ఉద్యోగుల్ని విధుల్లోకి తీసుకున్నామని ఆ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా పేరు చెప్పడానికి నిరాకరించిన ఒక బ్యాంక్ అధికారి మాట్లాడుతూ '' ఇది సాధారణంగా జరిగేదే. కొత్తగా వచ్చిన మేనేజిమెంట్ విధానాలను అర్ధం చేసుకోలేక కొంత మంది విధులను వదిలేస్తారు. దీనికి అంత ప్రాధాన్యం లేదు'' అని చెప్పినట్టు ఎకనామిక్ టైమ్స్ కధనం పేర్కొంది. అంతే కాకుండా యాక్సిస్ బ్యాంక్ నుంచి ఉద్యోగులు వెళ్ళిపోయిన మాట కూడా వాస్తవమేనని చెప్పినట్టు ఆ కథనం స్పష్టం చేసింది.

ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో 4,000 మందిని రేసీరియట్ చేసుకుంటామని యాక్సిస్ బ్యాంక్ ప్రకటీంచింది. దీంతో మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఆక్సిస్ బ్యాంకు నికర నియామకాలు 12,800 గా ఉంటాయని తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో మరో 30,000 మంది ఉద్యోగులను నియమించనున్నట్లు కూడా ఆక్సిస్ బ్యాంకు వెల్లడించింది. కాగా తక్కువ సమయంలో 15,000 మంది ఉద్యోగులు బ్యాంకును వీడటంతో ఆక్సిస్ బ్యాంకు అట్ట్రిషన్ రేటు 15% నుంచి 19% నికి పెరిగింది.

మొత్తమ్మీద యాక్సిస్ బ్యాంక్ నుంచి ఉద్యోగులు వెళ్లిపోతుండడం బ్యాంకింగ్ రంగంలో విశేషంగా చెప్పుకుంటున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories