Top
logo

ప్రపంచ పురుషుల దినోత్సవం: మగాళ్ల గురించి వారికే తెలీని కొన్ని విషయాలు!

ప్రపంచ పురుషుల దినోత్సవం: మగాళ్ల గురించి వారికే తెలీని కొన్ని విషయాలు!
X
Highlights

చిల్డ్రన్స్ డే ఎప్పుడని అడిగితే తడుముకోకుండా నవంబర్ 14 అని చెప్పేస్తారు. మహిళా దినోత్సవం మార్చి నెలలో రెండో...

చిల్డ్రన్స్ డే ఎప్పుడని అడిగితే తడుముకోకుండా నవంబర్ 14 అని చెప్పేస్తారు. మహిళా దినోత్సవం మార్చి నెలలో రెండో ఆదివారమని కచ్చితంగా చెప్పేయగలుగుతారు. చివరాఖరికి పులుల దినోత్సవం ఎప్పుడంటే కొంచెం ఆలస్యమైనా జూలై 29 అని చెప్పగలుగుతారు. ఇలా అన్నిరకాల దినోత్సవాలను ఉత్సవంగా ఉత్సాహంగా జరుపుకునే మనకి పురుషుల కోసం ప్రత్యేకంగా ఓ రోజు ఉందని దాదాపుగా తెలీదు. కానీ పురుషుల కోసమూ ఒక రోజు కేటాయించారు. మగాళ్ల కోసం ఒక రోజు ఎందుకు అని అనుకుంటున్నారా.. వారి ఆరోగ్యం కోసం.. ప్రపంచంలో విజయాల్ని సాధించిన మగవారి విజయగాధాలతో స్ఫూర్తిని నింపడం కోసం అంతే కాకుండా క్షేమకరమైన సమాజ స్థాపన కోసం ప్రతి సంవత్సరం నవంబర్ 19 వ తేదీని ప్రపంచ పురుషుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.

మొదట 1992లో థామస్ ఓస్టెర్ అనే అయన పురుషుల కోసం ప్రతేకంగా ఒక రోజు కేటాయించాలని ప్రతిపాదించి.. నిర్వహించారు. అయితే, అనేక కారణాల వాళ్ళ తరువాత దానిని ఎవరూ పట్టించుకోలేదు. చివిగారికి 1999లో ట్రినిడాడ్ కు చెందిన డాక్టర్ జెరోమ్ టీలూక్సింగ్ తిరిగి పురుషుల కోసం ప్రత్యేకంగా ఒక రోజు ఉండాలని దానిని కొనసాగించడం మొదలు పెట్టాడు. ఇది అప్పట్నుంచీ క్రమం తప్పకుండా నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి సంవత్సరం మగాళ్ల రోజుకు ఓ ప్రత్యేక థీమ్ పెట్టుకుంటున్నారు. ఈ సంవత్సరం పురుషుల ఆరోగ్యానికి సంబంధించిన థీమ్ ఎంపిక చేశారు.

మేకింగ్ ఏ డిఫరెన్స్ ఫర్ మేన్స్ అండ్ బాయ్స్ పేరుతో ఈ థీమ్ ప్రకటించారు. దీని ఉద్దేశ్యం పురుషులలో తమ ఆరోగ్యం పట్ల అవగాహన పెరగడం.

ఈరోజు పురుషుల దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా అసలు మగాళ్ల గురించి మగాళ్లకే తెలీని కొన్ని రహస్యాలు ఇక్కడ ఇస్తున్నాం..

సాధారణంగా మనమందరం ఆత్మహత్యలు ఎక్కువగా చేసుకునేది మహిళలు అని నమ్ముతాం. కానీ, అది నిజం కాదు. స్త్రీల కంటే పురుషుల లో ఆత్మహత్యల రేటు మూడు రేట్లు ఎక్కువ!

గృహ హింసకు మహిళలు గురవుతారని అందరూ ముక్త కంఠంతో చెబుతారు. అయితే, మగాళ్లే ఎక్కువగా గృహ హింసకు లోనవుతున్నారట. ఎంతలా అంటే.. ప్రతి ముగ్గురు మగాళ్లలో ఒకరు గృహ హింస కు గురవుతున్నారు!

ఊపిరి తిత్తులు, గుండె కు సంబంధించిన వ్యాధులు పురుషుల్లోనే ఎక్కువ. వారి అలవాట్ల కారణంగా ఇది చోటు చేసుకుంటోంది. అంతే కాదు, పురుషులు మహిళల కంటే తక్కువ జీవన ప్రమాన్నాన్ని కలిగి ఉంటున్నారు. అంటే స్త్రీల కంటే పురుషుల ఆయుర్దాయం తక్కువ!

ఇక బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడడం కూడా పురుషుల్లోనే ఎక్కువట. స్త్రీలతో పోల్చుకుంటే పురుషుల్లో 65 శాతం మంది బ్రెయిన్ క్యాన్సర్ బారిన పడుతున్నారు!

అదండీ సంగతి. పురుషులు స్ట్రాంగ్ అని ఎవరికైనా విపరీతమైన నమ్మకం ఉంటె ఈ విషయాలు తెలిసాకా అయినా అభిప్రాయం మార్చుకుంటారు. ఏమంటారు? పురుషులందరికీ.. అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు!

Web Titleinternational mens day 2019 lets focus on mens health and well being on this day
Next Story