అదృశ్యం కానున్న 'నానో' కారు.. ఈ ఏడాది ఒకే ఒక్క కారు సేల్!

అదృశ్యం కానున్న నానో కారు.. ఈ ఏడాది ఒకే ఒక్క కారు సేల్!
x
Highlights

రతన్ టాటా కలల కారు నానో అదృశ్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి కారు తేవాలన్న అభిలాషతో 2008 లో నానో కారు ప్ర్రాజెక్టు...

రతన్ టాటా కలల కారు నానో అదృశ్యం అయిపోయే పరిస్థితి వచ్చింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులోకి కారు తేవాలన్న అభిలాషతో 2008 లో నానో కారు ప్ర్రాజెక్టు ప్రారంభించింది టాటా కంపెనీ. దేశీయ ఆటో రంగం లో సంచలనం సృష్టించే విధంగా కనిపించిన నానో తొలి నాళ్లలో ఆ మేరకు సంచలనాలూ నమోదు చేసింది. కానీ, క్రమేపీ పోటీని తట్టుకోవడంలో పూర్తిగా విఫలం అయింది. ప్రజల అవసరాలను అందిపుచ్చుకుని తదనుగుణంగా మార్పులు తేవడంలో కూడా టాటా మోటార్స్ విఫలం అయిందని చెప్పవచ్చు. దీంతో.. నానో అమ్మకాలు రోజు రోజుకీ పడిపోయాయి. ఈ సంవత్సరం మొత్తమ్మీద ఒకే ఒక్క కారు అమ్మకం జరిగిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇక కంపెనీలో కూడా 9 నెలల నుంచి నానో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో.. నానో ఇక చరిత్రగా మిగిలిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బహుశా వచ్చే సంవత్సరంలో ఈ విషయాన్ని అధికారికంగా కంపెనీ ప్రకటించవచ్చని భావిస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories