సంక్షోభంలో ఆటో పరిశ్రమ.. రెండు దశాబ్దాల కనిష్టానికి అమ్మకాలు!!

సంక్షోభంలో ఆటో పరిశ్రమ.. రెండు దశాబ్దాల కనిష్టానికి అమ్మకాలు!!
x
Highlights

దేశీయ ఆటో పరిశ్రమ కనీ, వినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. గత ఇరవై ఏళ్లలో అమ్మకాల్లో ఇంతటి క్షీణతను చూడలేదని ఆ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి....

దేశీయ ఆటో పరిశ్రమ కనీ, వినీ ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. గత ఇరవై ఏళ్లలో అమ్మకాల్లో ఇంతటి క్షీణతను చూడలేదని ఆ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. వరుసగా పదో నెలలో కూడా అమ్మకాలు కనిష్ట స్థాయిలోనే నమోదయ్యాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు నెలలో కార్ల అమ్మకాలు దారుణంగా పడిపోయాయి. ఎంత దారుణంగా అంటే.. అమ్మకాల రికార్డులను 97-98 సంవత్సరాల నుంచీ రికార్ద్జు చేస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ గత నెలలో అతి తక్కువ అమ్మకాలు రికార్డు అయ్యాయి అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) సోమవారం దేశీయ ఆటో రంగ పరిస్త్టిపై గణాంకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఆగస్టులో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు సంవత్సరానికి 31.57 శాతం పడిపోయి 196,524 యూనిట్లకు చేరుకున్నాయి. వీటిలో ప్యాసింజర్ కార్ల అమ్మకాలు 41.09 శాతం తగ్గి 115,957 యూనిట్లకు చేరుకోగా, ట్రక్, బస్సు అమ్మకాలు 39 శాతం పడిపోయాయి. ఇక ద్విచక్ర వాహనాల అమ్మకాలు 22శాతం పడిపోయి 1.5 మిలియన్ యూనిట్లకు చేరుకున్నాయని గణాంకాలు చెబుతున్నాయి. అయితే, ఇదే సమయంలో ఎగుమతులు పుంజుకోవడం విశేషం. దాదాపు 14.73 శాతం ఎగుమతుల్లో వృద్ధి కనిపించింది.

ఇప్పటికే సంక్షోభం చుట్టుముట్టి ఉన్న ఈ రంగంలో ఈ గణాంకాలు మరింత ఆందోళన పెంచుతున్నాయి. ఉపాధి అవకాశాలపై ఈ ప్రభావం నేరుగా పడుతోంది. ఇప్పటికే వాహన్ కంపెనీలు 15 వేలమంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించాయి. దేశవ్యాప్తంగా 300 మంది డీలర్లు తమ డీలర్షిప్ వదులుకున్నారు. దీంతో దాదాపు 2.8 లక్షల మంది ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. ఇదే పరిస్థితి కొనసాగితే, దాదాపు పది లక్షల మందికి ఉద్వాసన తప్పదనే ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మారుతీ సుజుకీ హర్యానాలోని గురుగ్రాం, మనేసర్ ప్లాంట్లలో ఉత్పత్తిని రెండు రోజులు నిలిపివేసింది. కాగా, అశోక్ లేలాండ్ కూడా 16 రోజుల పనిదినాలు రద్దు చేస్తున్నట్టు చెప్పింది. దీంతో ఆటో పరిశ్రమ భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయి.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories