'మారుతి' ఏప్రిల్ నెలలో ఒక్క కారూ అమ్మలేదు..!

మారుతి ఏప్రిల్ నెలలో ఒక్క కారూ అమ్మలేదు..!
x
Maruti cars
Highlights

భారత దేశపు అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన చరిత్రలోనే తొలిసారిగా ఏప్రిల్ నెలలో ఒక్క కారూ అమ్మలేకపోయింది. లాక్ డౌన్ కారణంగా ఇది జరిగింది....

భారత దేశపు అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన చరిత్రలోనే తొలిసారిగా ఏప్రిల్ నెలలో ఒక్క కారూ అమ్మలేకపోయింది. లాక్ డౌన్ కారణంగా ఇది జరిగింది. అయితే ఈ కంపెనీ ఒకటే కాదు దాదాపుగా అన్ని కార్ల కంపెనీలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి.

కార్ల తయారీదార్లు అన్ని కార్ల కంపెనీల్లోనూ ఏప్రిల్ నెలలో జీరో సేల్స్ రిపోర్ట్ చూడబోతున్నట్టు అంచనా వేస్తున్నాయి. ఏప్రిల్ నెల మొత్తం లాక్ డౌన్ లో ఉండడమే దీనికి కారణం.

అయితే, మారుతి కంపెనీకి ప్రభుత్వం కొంత పాక్షిక సడలింపు ఇచ్చింది. దీంతో మారుతీ తన గుజరాత్ ప్లాంట్ నుంచి 632 కార్లను మందరా పోర్ట్ ద్వారా ఎగుమతి చేయగలిగింది. అదేవిధంగా మారుతీ సుజుకీ కంపెనీ హర్యానాలోని మనేసర్ ప్లాంట్ నుంచి కూడా పాక్షికంగా కార్యకలాపాలు మొదలు పెట్టింది. అక్కడి జిల్లా యంత్రాంగం ఒక్క షిఫ్ట్ లో ప్లాంట్ లో పనులు నిర్వహించుకోవచ్చని అనుమతి ఇచ్చింది.

దీంతో మారుతీ కంపెనీ ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలకు లోబడి ఫ్యాక్టరీలో కార్ల ఉత్పత్తి ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రయివేటు కంపెనీలు ఏప్రిల్ 20 నుంచి కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఉత్తర్వులతో షరతులకు లోబడి మారుతీ మనేసర్ లో తన కార్యకలాపాలు పాక్షికంగా పునరుద్ధరించింది.

మనేసర్ ప్లాంట్ లో 4,696 మంది సిబ్బంది తో 50 వాహనాలతో ఉత్పత్తి కార్యక్రమాలు ప్రారంభించుకోవచ్చని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

మారుతీ కంపెనీ మార్చి 22 నుంచి తన ప్లాంట్లలో కార్యకలాపాలు నిలిపివేసింది. జనతా కర్ఫ్యూ విధించిన వెంటనే తన ప్లాంట్లలో ఉత్పత్తి నిలిపెస్తున్నట్టు ప్రకటించింది.

ఇక మారుతీ కంపెనీ కరోనావైరాస్ కారణంగా మార్చి 2020 లో 47 శాతం అమ్మకాలను కోల్పోయింది. ఆ నెలలో మొత్తంగా 83,792 వాహనాలను విక్రయించింది. గత సంవత్సరం మార్చి నెలలో ఈ అమ్మకాల సంఖ్య 1,58,076 కావడం గమనార్హం.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories