జగన్‌ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ

జగన్‌ అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ భేటీ
x
Highlights

ఏపీ భవన్‌లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఉభయ సభలకు చెందిన వైసీపీ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో...

ఏపీ భవన్‌లో వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. ఉభయ సభలకు చెందిన వైసీపీ ఎంపీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ చర్చించనున్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం ఉభయ సభల్లోనూ అవలంబించాల్సిన విధానంపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ నెల 17 నుంచి ప‍్రారంభం కానున్న పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొనున్నారు. ప్రధాన మంత్రి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో 115 ఏస్పిరేషనల్ జిల్లాలపై చర్చ జరగనుంది. 115 ఏస్పిరేషనల్ జిల్లాల జాబితాలో ఏపీలోని వైఎస్సార్ కడప, విజయనగరం, విశాఖ, తెలంగాణలో అసిఫాబాద్, భూపాలపల్లి, ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. నీతి ఆయోగ్ సమావేశంలో తనకు కేటాయించిన సమయం ప్రకారం వైఎస్ జగన్ 7 నిమిషాలు మాట్లాడనున్నారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకావడం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories