చైర్మన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందా? రద్దే నిర్ణయమా?

చైర్మన్ వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పష్టత ఇస్తుందా? రద్దే నిర్ణయమా?
x
Highlights

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సోమవారం భేటీ కానుంది. శాసనమండలిని ఉంచాలా? రద్దు చేయాలా? అనే అంశంపై అసెంబ్లీలో చర్చిద్దామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేసిన...

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సోమవారం భేటీ కానుంది. శాసనమండలిని ఉంచాలా? రద్దు చేయాలా? అనే అంశంపై అసెంబ్లీలో చర్చిద్దామని ఏపీ సీఎం జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో.. ఈనెల 27న జరిగే ఏపీ కేబినెట్ భేటీ ఆసక్తికరంగా మారింది. సోమవారం ఉదయం 9.30 గంటలకు జరగబోయే మంత్రివర్గ సమావేశంలో మండలి రద్దు అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మండలి రద్దుపై కేబినెట్ లో తీర్మానం చేసిన వెంటనే 10 గంటల 30 నిమిషాలకు BAC మీటింగ్ నిర్వహిస్తారు. BAC లో మండలి రద్దుపై చర్చించి.. అనంతరం అసెంబ్లీకి పంపిస్తారు. అదే రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది.

కేబినెట్‌లో మండలి రద్దు నిర్ణయం తీసుకుని.. ఆ వెంటనే దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపే యోచనలో ఉంది ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. అమరావతి తరలింపు, crda ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ షరీఫ్ నిర్ణయం తీసుకున్నారు. దాంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న సీఎం జగన్.. మండలి రద్దు దిశగా అడుగులు వేస్తున్నారు. గురువారం అసెంబ్లీలో మాట్లాడుతూ మండలిపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీని సమావేశపరచి మండలిని కొనసాగాలా లేదా అనే అంశంపై చర్చిద్దామని స్పీకర్ ను అభ్యర్ధించారు. దీనిపై స్పీకర్ అలాగే చర్చిద్దామని అని సభ సోమవారానికి వాయిదా వేశారు. మరోవైపు ఈ బిల్లులు ఇంకా సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని మండలి చైర్మన్ మెలిక పెట్టారు. ఇంకా ప్రాసెస్ లోనే ఉందని స్పష్టం చేశారు. దీంతో గందరగోళం నెలకొన్నట్టయింది.

రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించానని మండలిలో చెప్పిన షరీఫ్.. తాజాగా ఇంకా ప్రాసెస్ లోనే ఉందని చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే స్వరం మారినట్టు అర్ధమవుతోంది. బుధవారం మండలిలో పదకొండు నిమిషాల పాటు ప్రసంగించిన చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు ప్రకటించగానే సభలో గందరగోళం ఏర్పడింది. చైర్మన్ తన ఆదేశాలను ప్రకటించగానే అధికార పక్ష సభ్యులు, మంత్రులు చైర్మన్ నిర్ణయంపై మండిపడ్డారు. దాంతో చైర్మన్ ఏమి మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అంతేకాదు మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు కూడా చైర్మన్ ప్రకటించలేదు.. కేవలం సంతకం మాత్రమే పెట్టి వెళ్లిపోయారు. మండలి నిరవధికంగా వాయిదా పడిన విషయాన్నీ టీడీపీ సభ్యులే వెల్లడించారు. అయితే మండలిలో జరిగిన గందరగోళం నేపథ్యంలో బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లకుండా మధ్యలోనే ఆగిపోయినట్టు చైర్మన్ భావిస్తున్నటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై ఇవాళో రేపో ప్రభుత్వమే స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories