శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద

శ్రీశైలం జలాశయానికి తగ్గుతున్న వరద
x
Highlights

శ్రీశైలం జలాశయానికి గత కొద్దిరోజులుగా వస్తున్న వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. డ్యాం నుండి నీటి విడుదల ఇంకా కొనసాగుతోంది. జలాశయం 10 క్రెస్ట్ గేట్లను 30 అడుగుల మేరకు తగ్గించి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

శ్రీశైలం జలాశయానికి గత కొద్దిరోజులుగా వస్తున్న వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. డ్యాం నుండి నీటి విడుదల ఇంకా కొనసాగుతోంది. జలాశయం 10 క్రెస్ట్ గేట్లను 30 అడుగుల మేరకు తగ్గించి సాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం జూరాల నుండి 6.97 లక్షల క్యూసెక్కులునీరు జలాశయంలోకి చేరుతోంది. దీంతో శ్రీశైలం జలాశయం 10 గేట్లను 30 అడుగుల మేర ఎత్తి 6 లక్షల 31 వేల 640 క్యూసెక్కుల నీటిని గేట్ల ద్వారా విడుదల చేస్తున్నారు.

ఇక శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 881.40 అడుగులతో,గరిష్ట నీటి నిల్వ 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 196 5611 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక ప్రాజెక్టులోని కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా,ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా దాదాపు 69 వేల క్యూసెక్కుల నీటిని వినియోగించుకుంటూ ఏపీ మరియు టీఎస్ జెన్ కో అధికారులు విద్యుత్ ఉత్పత్తి చేస్తు, ఆ నీటిని దిగువ నాగార్జునసాగర్ కు విడుదల చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories