రాజధానిపై చర్చ జరిగేది అప్పుడే : మంత్రి పేర్ని నాని

రాజధానిపై చర్చ జరిగేది అప్పుడే : మంత్రి పేర్ని నాని
x
Perni Nani File Photo
Highlights

వచ్చే బడ్జెట్ సెన్షన్లో ఏపీ రాజధానిపై చర్చ జరుగుతుందని సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని.

వచ్చే బడ్జెట్ సెన్షన్లో ఏపీ రాజధానిపై చర్చ జరుగుతుందని సమాచార, ప్రజా సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని. బుధవారం సచివాలయంలో విలేకరుల సమావేశం సందర్బంగా మాట్లాడిన పేర్ని నాని.. లెజిస్లేటివ్‌ రాజధాని అమరావతిలో, జ్యుడిషియల్‌ రాజధాని కర్నూలులో, ఎగ్జిక్యూటివ్‌ రాజధాని విశాఖలో ఉండొచ్చు అన్నారు. అయితే కమిటీ నివేదిక వచ్చాకే తుది నిర్ణయం ఉంటుందన్నారు.. అసెంబ్లీలో కూడా జగన్‌ అదే విషయం చెప్పారని గుర్తుచేశారు.. రాజధాని అంశంపై 2020 మార్చిలో జరిగే బడ్జెట్ సెషన్‌లో చర్చ జరుగుతుందన్నారు మంత్రి. అసెంబ్లీ శీతాకాల సమావేశం ముగింపు రోజు ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించినట్లుగా జరుగుతుందేమోనని నాని పేర్కొన్నారు,

నిపుణుల కమిటీ త్వరలో తన నివేదికను సమర్పించనుందని.. కమిటీ నివేదిక సమర్పించిన తరువాత, ప్రభుత్వం దానిని బడ్జెట్ సెషన్‌లో చర్చ కోసం ఉంచుతుందని తెలిపారు.టీడీపీ తో సహా సభ్యుల సలహాలను తీసుకుంటుందని పేర్ని నాని వివరించారు. టీడీపీ ఏదైనా నిర్మాణాత్మక సూచనలు ఇస్తే, ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుందన్నారు. రాజధానిని విభజించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందని, వాటిని మార్చడం అసెంబ్లీలో చర్చించిన తర్వాతే జరుగుతుందని నాని తెలియజేశారు.

ఇదిలావుంటే విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రావచ్చు, కర్నూలులో హైకోర్టు.. జ్యుడీషియల్ క్యాపిటల్ రావచ్చు, ఇక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ కు బహుశా మూడు క్యాపిటల్ వస్తాయేమో. ..

విశాఖలో మెట్రో రైలు వేస్తే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా సరిపోతుంది. ఇటువంటి ఆలోచనలు చేయడానికే కమిటీలు వేశాం. కొద్ది రోజుల్లో కమిటీ నివేదిక వస్తుంది. అధ్యయనం కోసం.. మొత్తం మూడు సంస్థలకు అప్పగించాం. ఆ సంస్థలు సుదీర్ఘంగా ఆలోచన చేసి.. నివేదిక ఇచ్చాక.. మంచి నిర్ణయం తీసుకుంటాం. మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి నిర్ణయం తీసుకోవాలి. అని జగన్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. అయితే దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తీవ్రంగా తప్పుబడుతోంది. మూడు రాజధానులు చేస్తే ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటారని చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories