ప్రస్తుతానికి ఆలోచన లేదు.. భవిశ్యత్ లో మార్పు ఉండొచ్చు: రాయపాటి

ప్రస్తుతానికి ఆలోచన లేదు.. భవిశ్యత్ లో మార్పు  ఉండొచ్చు: రాయపాటి
x
Rayapati Sambasivarao File photo
Highlights

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా తన ఇళ్ళు, ఆఫీసులపై సీబీఐ సోదాలు చేసిన విషయాన్నీ ఆయన దృవీకరించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని అన్నారు. 'సీబీఐ అధికారులు సోదాలు చేయడం కోసం వచ్చినప్పుడు తాను కంపెనీలో లేనని.. తనిఖీలు చేసి ఏమీ లేదని సీబీఐ అధికారులు వెళ్లిపోయారని అన్నారు. సీబీఐ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. అంతేకాదు రాజకీయంగా ఒక కీలక వ్యాఖ్య కూడా చేశారు. ప్రస్తుతానికి టీడీపీని వీడే ఆలోచన తనకు లేదని.. భవిశ్యత్ లో ఉండొచ్చు అని రాయపాటి చెప్పుకొచ్చారు. దీంతో భవిశ్యత్ లో ఉండొచ్చు అంటే పార్టీ మారే ఆలోచన అయితే చేస్తున్నారన్నది విస్పష్టం. 2014 సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన రాయపాటి ఆ తరువాత నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. అంతకంటే ముందు కాంగ్రెస్ లో ఉంటూ.. సుదీర్ఘకాలం ఎంపీగా పనిచేశారు.

అయితే గడిచిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం బీజేపీలో చేరతారని వార్తలు బలంగా వినిపించాయి. కానీ అదేసమయంలో ఆయనకు బీజేపీ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని కూడా ప్రచారం జరిగింది. రాయపాటి చేరికను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అడ్డుకుంటున్నారన్న వాదన కూడా ఉంది. రాయపాటికి, కన్నా కు మధ్య ఏళ్ల తరబడి రాజకీయ వైరం కొనసాగుతోంది. అయినా కూడా ఒకానొక దశలో కన్నా మాట్లాడుతూ.. పార్టీకి ఉపయోగపడే వారు ఎవరు వచ్చినా చేర్చుకుంటామని చెప్పారు. కానీ ఇంతవరకు రాయపాటికి అనుమతి రాలేదు. ఈ క్రమంలో తాజాగా సిబిఐ అధికారులు సోదాలు నిర్వహించడంతో రాయపాటి పార్టీ మార్పు వ్యవహారం మళ్ళీ తెరమీదకు వచ్చింది. బీజేపీలో చేరేందుకు రాయపాటి భవిశ్యత్ లో పార్టీ మారొచ్చేమో అని వ్యాఖ్యానించి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి భవిశ్యత్ లో ఏమి జరుగుతోందో చూడాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories