శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..నాగార్జున సాగర్ దిశగా కృష్ణమ్మ పరవళ్లు

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత..నాగార్జున సాగర్ దిశగా కృష్ణమ్మ పరవళ్లు
x
Highlights

కృష్ణా నదికి భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. ఏడు గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు...

కృష్ణా నదికి భారీ ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను ఎత్తారు. ఏడు గేట్ల ద్వారా వరద నీటిని దిగువకు వదులుతున్నారు.ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణా నది, దాని ఉపనదులకు వరద పోటెత్తుతోంది. ఇప్పటికే ఆల్మట్టి, జూరాల జలాశయాలు నిండటంతో.. శ్రీశైలం డ్యామ్‌కు భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది.

ఎగువ నుంచి నాలుగు లక్షలకుపైగా ఇన్‌ఫ్లో ఉండటంతో.. శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. జురాల నుంచి 4 లక్షల 96 వేల157 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది.భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటంతో ప్రస్తుతం 882.40 అడుగులకు చేరింది. శ్రీశైలం డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా... ప్రస్తుత సామర్థ్యం 201.1205 టీఎంసీలు. దీంతో 74, వేల 650 క్యూసెక్కుల వరదనీటిని నాగార్జునసాగర్‌కి విడుదల చేశారు. దీంతో నాగార్జున సాగర్‌లో కూడా జలకళ ఉట్టిపడుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండా నీళ్లు ఉండటంతో ఎడమ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి జరుగుతోంది.

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు ఆల్మట్టి, నారాయణపూర్‌, జూరాల జలాశయాలను దాటి కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.పోతిరెడ్డిపాడు నుంచి 28వేల క్యూసెక్కులు, హంద్రీనీవా కాలువకు 2 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో జలదృశ్యం చూసేందుకు పర్యాటకులు భారీగా తరలివచ్చారు. డ్యామ్ గేట్లు ఎత్తడంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. వీకెండ్స్ కావడంతో కృష్ణమ్మ పరవళ్లను కళ్లారా చూసేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories