Srikakulam : చికెనా వామ్మో మాకొద్దు !

Srikakulam : చికెనా వామ్మో మాకొద్దు !
x
Chicken Shop File Photo
Highlights

మాంసాహారం వలనే కరోనా వైరస్‌(కోవిడ్‌–19) వార్తలతో మాంసం ప్రియులు వెనుకంజ వేస్తున్నారు.

మాంసాహారం వలనే కరోనా వైరస్‌(కోవిడ్‌–19) వస్తుందన్న వార్తలతో మాంసం ప్రియులు వెనుకంజ వేస్తున్నారు. దీంతో శ్రీకాకుళం జిల్లాలో మాంసం విక్రయాలు బాగా తగ్గిపోయాయి. మాంసం విక్రయాలపై కోవిడ్‌–19 దెబ్బ పడింది. దీంతో చికెన్ అమ్మకాలు 60 శాతంపైగా పడిపోయాయి. ఈ దెబ్బ ఒక కోడి మాంసంకే కాదు, చేపలు అమ్మకాలపై కూడా పడింది. విక్రయాలు తగ్గిపోవడంతో మాంసంపై ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కోడి మాంసం విక్రయాల్లో రూ.3 కోట్లు, వేట మాంసం, చేపల అమ్మకాల్లో రూ.1కోటి వరకు వ్యాపారులు నష్టపోయారని తెలుస్తోంది. మాంసం తింటే కరోనా వైరస్‌ కోవిడ్‌–19 సోకే ప్రమాదముందని ప్రచారం జరగడంతోనే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని వ్యాపారస్థులు వాపోతున్నారు.

కాగా.. ఆదివారం ఒకే రెండు లక్షల కోళ్ల వరకు అమ్మకాలు జరిగేవి. తర్వాత నాలుగు రోజుల్లో మరో లక్ష కోళ్ల వరకు అమ్మాకాలు జరిగేవి. అయితే జిల్లాలో వారానికి 3లక్షల కిలోల వరకు కోడి మాంసం అమ్మకాలు జరిగేవి. అయితే ఇప్పుడు దారుణంగా పడిపోయింది. కేవలం 70 వేల కిలోలు మాత్రమే విక్రయిస్తున్నాట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం ఇవే ధరలు రూ.230, రూ.250ల వరకు ఉండేవి. అలాగే ధర కూడా స్కిన్‌తో ఉన్న చికెన్‌ కిలో రూ.95కు, స్కిన్‌లెస్‌ రూ.115 లకు పడిపోయింది. ఆది, మంగళ వారాల్లో వేటమాంసం 30 వేల కిలోల నుంచి 15 వేల కిలోలు కూడా అమ్ముడుపోవడం లేదని వ్యాపారస్తులు లబోదిబో అంటున్నారు. సముద్ర చేపలను కూడా తినేందుకు మాంసాహారులు విముఖత చూపుతున్నారు.

విద్యాశాఖ అధికారులు మాంసం కొనేందుకు సుముఖత చూపడం లేదు. ఎందుకంటే పాఠశాలలు, హాస్టళ్లలో మాంసం వడ్డిస్తున్నా.. విద్యార్థులు తినకపోవడంతో వార్డెన్లు వారికి పౌష్టికాహారాన్ని వడ్డిస్తున్నారు. కోడి గుడ్డును తినేందుకు కూడా కొందరు ఆసక్తి చూపండం లేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories