ఇవాళ ఏలూరులో బీసీ సమాజిక చైతన్య సభ.. బీసీలను ఓట్ల కోసమే ఉపయోగించుకున్నారన్న సోము వీర్రాజు

* ఆ రెండు పార్టీలు బీసీలకు చేసిందేమిటని ప్రశ్న... బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమవుతుందని వెల్లడి

R Tripura Malini
Updated on: 27 Nov 2022 7:53 AM IST
somu veeraraju said bcs were used only for votes
X

బీసీలను ఓట్ల కోసమే ఉపయోగించుకున్నారన్న సోము వీర్రాజు

Somu Veerraju: వైసీపీ, టీడీపీ పార్టీలు బీసీలను ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకుంటున్నాయని ఏపీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు ఆరోపించారు. ఇవాళ ఏలూరులో బీజేపీ ఆధ్వర్యంలో జరగబోయే బీసీ సామాజిక చైతన్య సభ నిర్వహించనున్నారు. రాష్ట్రంలో నాలుగు చోట్ల బీసీ సామాజిక చైతన్య సభలు ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో బీసీలకు రాజ్యాధికారం బీజేపీ, జనసేనలతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీసీ ఆధారిత ప్రభుత్వ ఏర్పాటుతో రాష్ట్రాభివృద్ది సాధిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినా ఒక బడ్జెట్, ఒక ఆఫీస్ లేదని విమర్శించారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story