ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే..

ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే..
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో శాసన సభ ఎన్నికల పర్వం ముగిసింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొలువు తీరింది. మున్నెన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో వైసీపీ...

ఆంధ్రప్రదేశ్ లో శాసన సభ ఎన్నికల పర్వం ముగిసింది. పూర్తి స్థాయిలో ప్రభుత్వం కొలువు తీరింది. మున్నెన్నడూ లేని విధంగా అత్యధిక మెజార్టీతో వైసీపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. తిరుగులేని తన ఆధిపత్యాన్ని.. క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసుకోవడానికి ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఔత్సాహికులకు కావలసిన అర్హతలు.. పోటీ చేయాలంటే పాటించాల్సిన నియమ నిబంధనలూ మీకోసం..

* గ్రామపంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుడిగా పోటీ చేయడానికి అభ్యర్థి వయసు ఎన్నికల రిటర్నింగ్‌అధికారులకు నామపత్రాలు పరిశీలించే తేదీ నాటికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి.

* సర్పంచి, వార్డు సభ్యుడు పదవికి పోటీ చేసే వ్యక్తి పేరు సంబంధిత గ్రామపంచాయతీ ఓటర్ల జాబితాల్లో నమోదై ఉండాలి. గ్రామ ఓటరు జాబితాలో పేరులేని పక్షంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు.

* ఎన్నికల్లో గ్రామపంచాయతీ వార్డు సభ్యుడి పేరును ప్రతిపాదించాలంటే తాను పోటీ చేస్తున్న వార్డులో ఓటరుగా నమోదై ఉండాలి. సర్పంచి అభ్యర్థిని ప్రతిపాదించాలంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఓటరుగా నమోదవ్వాలి.

* ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి 31.5.1995 తేదీకంటే ముందు ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నా.. ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. 1.6.1996 తర్వాత ముగ్గురు పిల్లలు కలిగిఉన్న వారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు.

* పిల్లలను దత్తత ఇచ్చినప్పుడు ఆ పిల్లలు సొంత తల్లిదండ్రులకు చెందిన వారిగానే పరిగణిస్తారు. పోటీ చేసే వ్యక్తి ముగ్గురు పిల్లలు కలిగి ఉండి ఒకరిని దత్తత ఇచ్చినా.. అతనికి ముగ్గురు పిల్లలుగా భావించి పోటీకి అనర్హుడిగా ప్రకటిస్తారు.

* ఒక వ్యక్తి మొదటి భార్య ద్వారా ఇద్దరు పిల్లలను కలిగి, భార్య మరణించిన తర్వాత రెండో భార్య ద్వారా మరో సంతానాన్ని పొందితే అతను ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడు. ఇది ఇలా ఉండగా అతని భార్య ఒకే సంతానం కల్గి ఉండటం వల్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హురాలు.

* అభ్యర్థి ముగ్గురు పిల్లలు కలిగి ఉండి నామపత్రాలు పరిశీలన రోజు ఒక పిల్లవాడు మరణిస్తే ప్రస్తుతం ఆ అభ్యర్థి సంతానం ఇద్దరుగానే భావించి ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులుగా భావిస్తారు.

* నామపత్రాల పరిశీలన నాటికి ఇద్దరు పిల్లలు కలిగి ఉండి మళ్లీ గర్భిణి అయిన మహిళ పోటీకి అర్హురాలే. నామినేషన్‌ పరిశీలన నాటికి ఇద్దరు పిల్లలు ఉన్నట్లు భావిస్తారు.

* చౌకధర దుకాణాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్న రేషన్లు డీలర్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హుడు. దీనిపై న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

* అంగన్‌వాడీ సిబ్బంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు

* నీటి వినియోగదారుల సంఘాల సభ్యులు, కార్యాలయాల బేరర్లు పంచాయతీ అనర్హులు.

* సహకార సంఘాల సభ్యులు అర్హులు.

* స్వచ్ఛంద సంస్థలు, మత సంస్థల ఛైర్మన్లు, సభ్యులు అనర్హులు

* రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు అర్హులు. కంపెనీ మేనేజింగ్‌ ఏజెంట్‌, నిర్వాహకుడు, సెక్రటరీ స్థాయి ఉద్యోగులు అనర్హులు.

* ఎవరైనా మతి స్థిమితం లేని వ్యక్తి నామపత్రాన్ని దాఖలు చేసినట్లు ఇతర సభ్యులు ఆధారాలతో నిరూపిస్తే అభ్యర్థి అనర్హుడవుతాడు.

* ఒక వ్యక్తి క్రిమినల్‌ న్యాయస్థానం ద్వారా దోషిగా నిర్ధారించబడితే అతను ఆ రోజు నుంచి ౫ సంవత్సరాల వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హుడు. విచారణ అనంతరం న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన వ్యక్తి కోర్టు నుంచి స్టే, బెయిల్‌ పొందిన వ్యక్తి అనర్హుడు.

* నామపత్రాలు పరిశీలన రోజునాటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా ఉండరాదు. పోటీ చేయదలచిన అభ్యర్థి రాజీనామా చేయాలి.. ఆ రాజీనామాను ప్రభుత్వం ఆమోదించాలి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories