వై.యస్. రాజశేఖరరెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్: చంద్రబాబు

రాజశేఖర్‌రెడ్డి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆయనతో రాజకీయ వైరం తప్ప మరే ఏ వ్యక్తిగత వైరం లేదని నారా చంద్రబాబు...
రాజశేఖర్‌రెడ్డి తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, ఆయనతో రాజకీయ వైరం తప్ప మరే ఏ వ్యక్తిగత వైరం లేదని నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గురువారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా విగ్రహాల తొలగింపుపై జరిగిన చర్చలో భాగంగా చంద్రబాబుపై వైసీపీ శాసనసభ్యులు అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజశేఖర్‌రెడ్డి విగ్రహాలంటే చంద్రబాబుకు కడుపు మంట అని విజయవాడలో ఎవరికీ అడ్డం లేని చోట రాజవేఖర్‌రెడ్డి విగ్రహం ఉందన్నారు. రోజూ చంద్రబాబు ఈ దారి గుంట వెళుతుంటే.. రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని చూసి ఓర్వలేక దానిని తొలగించిన మహానుభావుడు నారా చంద్రబాబు అని అంబటి ఎద్దేవా చేశారు.
కాగా దీనిపై నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నా బెస్ట్ ఫ్రెండ్ అని అన్నారు. 1975 నుంచి 1983 వరకు కలిసి ప్రయాణం చేశాం. రాజశేఖర్ రెడ్డి, నేను ఒకే రూమ్‌లో పడుకున్నాం అధ్యక్షా.. సీఎం వైఎస్ జగన్ రెడ్డికి మా స్నేహం తెలియక పోవచ్చు అధ్యక్షా. మా మధ్య రాజకీయ విరోధం తప్ప వ్యక్తిగత విరోధం లేదన్నారు. రాజకీయంగా పోరాడం తప్పవక్తిగతం కాదన్నారు. నేను తెలుగుదేశంలోకి వచ్చాను ఆయన కాంగ్రెస్ లోకి వెళ్లారు అని అన్నారు.
లైవ్ టీవి
కలెక్టర్ దేవసేనను కొనియాడిన గవర్నర్
14 Dec 2019 4:19 PM GMTరూలర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానిగా మారిపోయిన బాలయ్య
14 Dec 2019 4:14 PM GMTహైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్
14 Dec 2019 3:50 PM GMTవర్మ పెదకర్మ అంటూ బ్యానర్స్ .. ఆసక్తికరమైన ట్వీట్ చేసిన...
14 Dec 2019 3:38 PM GMTభారత మార్కెట్లో డెల్ జి5 5090 గేమింగ్ డెస్క్టాప్
14 Dec 2019 3:19 PM GMT