మన్యంలో మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు కలెక్టర్‌ ఆదేశం:hmtv ఇంపాక్ట్‌

మన్యంలో మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులకు కలెక్టర్‌ ఆదేశం:hmtv ఇంపాక్ట్‌
x
Highlights

విశాఖ జిల్లా మన్యం గర్భిణీ కష్టాలపై హెచ్‌ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలపై.. జిల్లా అధికారలు స్పందించారు. హెచ్‌ఎంటీవీ కథనాల ప్రభావంతో.. జిల్లా కలెక్టర్‌...

విశాఖ జిల్లా మన్యం గర్భిణీ కష్టాలపై హెచ్‌ఎంటీవీ ప్రసారం చేసిన కథనాలపై.. జిల్లా అధికారలు స్పందించారు. హెచ్‌ఎంటీవీ కథనాల ప్రభావంతో.. జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌.. మన్యంలో వైద్య సేవలపై డీఎంహెచ్‌వోను ఆరా తీశారు. తక్షణమే గర్భిణీలకు మెరుగైన వైద్య చికిత్సలు అందేలా చూడాలని వైద్యాధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్‌.

నాగరికతకు దూరంగా బతుకుతున్న గిరిజనుల కష్టాలు.. కన్నీటిని తెప్పిస్తున్నాయి. కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని వారి జీవితాలు.. దుర్భరస్థితిలో గడుస్తున్నాయి. ఏదైనా రోగం వచ్చినా.. లేక డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినా.. రోడ్డు సౌకర్యం కూడా లేకపోవడంతో.. దారుణమైన పరిస్థితుల మధ్య బతుకీడుస్తున్నారు.

తాజాగా గర్భం దాల్చిన ఓ మహిళను నొప్పులు రావడంతో.. డెలివరీ కోసం ఆస్పత్రికి తరలించేందుకు డోలీలో మోసుకెళ్లాల్సి వచ్చింది. ప్రసవ వేదన పడుతున్న తల్లిని, లోకం చూడబోతున్న బిడ్డను రక్షించాలన్న గిరిజనుల ఆరాటం.. కళ్లకు కట్టింది. వారుంటున్న నివాసాల దగ్గరకు ఎలాంటి వాహనాలు వచ్చేందుకు వీలు లేకపోవడంతో.. కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లాల్సి వస్తుంది.

ఈ విషయమై hmtv కథనాలకు విశాఖ జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories