ఏపీలో ఐపీఎస్‌లకు పదోన్నతులు

ఏపీలో ఐపీఎస్‌లకు పదోన్నతులు
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. 18 మంది ఐపీఎస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ అధికారులకు పదోన్నతులు లభించాయి. 18 మంది ఐపీఎస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. సూపర్‌ టైం స్కేల్‌ ప్రకారం ఐపీఎస్‌లకు జీతాలు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఐపీఎస్‌ అధికారులకు డీఐజీగా పదోన్నతి కల్పించింది. 1995 బ్యాచ్ అధికారులు అతుల్ సింగ్, ఆర్కే మీనాలకు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

2002 బ్యాచ్ ఐపీఎస్ అధికారులు సీహెచ్ శ్రీకాంత్, ఎ.ఎస్.ఖాన్, జె.ప్రభాకర్ రావు, డి.నాగేంద్రకుమార్ లకు ఐజీ ర్యాంకు హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2006 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారులకు డీఐజీలుగా ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories