AP High Court: బిగ్‌బాస్‌ షోను బ్యాన్‌ చేయాలని ఏపీ హైకోర్టులో పిల్‌

AP High Court: పిటిషనర్‌ జగదీశ్వర్‌రెడ్డి తరపున న్యాయవాది శివప్రసాద్‌ పిల్‌ దాఖలు

Jyothi
Published on: 30 Sept 2022 1:20 PM IST
PIL Has Been Filed in AP High Court to Ban the Bigg Boss Show
X

AP High Court: బిగ్‌బాస్‌ షోను బ్యాన్‌ చేయాలని ఏపీ హైకోర్టులో పిల్‌

AP High Court: బిగ్‌బాస్‌ షోను బ్యాన్‌ చేయాలని ఏపీ హైకోర్టులో పిల్‌ దాఖలైంది. పిటిషనర్‌ జగదీశ్వర్‌రెడ్డి తరపున న్యాయవాది శివప్రసాద్‌ పిల్‌ దాఖలు చేశారు. IBF గైడ్‌ లైన్స్‌ ప్రకారం సమయాన్ని పాటించాలన్న పిటిషనర్.. రాత్రి 11 నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు మాత్రమే బిగ్‌బాస్‌ టెలికాస్ట్‌ చేయాలని పిటిషన్‌లో కోరారు. బిగ్‌బాస్‌ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని పిటిషనర్ అభిప్రాయపడ్డారు. అయితే.. పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు.. ఘాటుగా స్పందించింది. 1970లలో ఎలాంటి సినిమాలు వచ్చాయో తెలుసుకదా అని ప్రశ్నించింది. దీనిపై స్పందించేందుకు కేంద్రం తరపు న్యాయవాది సమయం కోరారు. దీంతో ప్రతివాదులకు నోటీసులపై తదుపరి వాయిదాలో నిర్ణయిస్తామన్న న్యాయస్థానం.. విచారణను అక్టోబర్‌ 11కు వాయిదా వేసింది.

Jyothi

Jyothi

Next Story