జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన భవిత కేంద్రం దివ్యాంగ విద్యార్థులు

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన భవిత కేంద్రం దివ్యాంగ విద్యార్థులు
x
అధికారులు మరియు క్రీడా పోటీలో గెలుపొందిన విద్యార్థులు
Highlights

ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో నిర్వహించారు.

రావికమతం: ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, విశాఖపట్నం వారు నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో రావికమతం భవిత కేంద్రం దివ్యాంగ విద్యార్థులు 50 మీటర్ల పరుగు పందెం, జావెలిన్ త్రో ,డిస్క్ త్రో , షాట్ ఫుట్, సాఫ్ట్ బాల్, ట్రై సైకిల్ రేసింగ్ పోటీలలో ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించి విజేతలుగా నిలిచారు.

ఈ జిల్లా స్థాయి క్రీ డా పోటీల్లో జిల్లా నలుమూలల నుంచి 835 మంది దివ్యాంగ విద్యార్థులు పాల్గొన్నారు. రావికమతం మండలం నుండి ఐదుగురు దివ్యాంగ విద్యార్థులు జిల్లా స్థాయి క్రీడ పోటీలలో పాల్గొనగా అందులో ముగ్గురు దివ్యాంగ విద్యార్థులు (శారీరక,మానసిక వైకల్యం) 50 మీటర్ల పరుగు పందెం, జావెలిన్ త్రో ,డిస్క్ త్రో, షాట్ ఫుట్, సాఫ్ట్ బాల్, ట్రై సైకిల్ రేసింగ్ పోటీలలో ప్రధమ, ద్వితీయ స్థానాలు సాధించారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories