Ainavilli: మూడు రాజధానులకు మద్దతుగా పూజలు

మూడు రాజధానులకు మద్దతు ప్రకటించే విధంగా చంద్రబాబుకు మంచిబుద్ధి కలగాలని శనివారం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు.

S. Srikanth
Published on: 8 Feb 2020 7:11 PM IST
Ainavilli: మూడు రాజధానులకు మద్దతుగా పూజలు
X

అయినవిల్లి: మూడు రాజధానులకు మద్దతు ప్రకటించే విధంగా చంద్రబాబుకు మంచిబుద్ధి కలగాలని శనివారం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర దశాబ్దాలుగా వెనుకబడి ఉందని, రాయలసీమ ప్రాంతంలో కరువు కాటకాలను అంతమొందించాలనే సదుద్దేశ్యంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలియజేశారు.

కార్యక్రమంలో మండల అద్యక్షుడు మట్టపర్తి శ్రీనివాస్, రాష్ట్ర యువజన కార్యదర్శి గుత్తుల నాగబాబు, అయినవిల్లి సొసైటీ అద్యక్షుడు కాకిలేటి శ్రీనివాస్, నంబూరి శ్రీరామచంద్రరాజు, గన్నవరపు చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


S. Srikanth

S. Srikanth

Next Story